సత్యమొక్కటే, దర్శనాలు వేరు
టాగోర్ గాంధీ సంవాదం
టాగోర్ ని జాతి ఒక కవివరుడిగా, గురుదేవుడిగా గుర్తుపెట్టుకుంటుంది. గాంధీజిని ఒక కర్మవీరుడిగా, మహాత్ముడిగా అంగీకరించింది. ఆ కవీంద్రునికి, ఆ కర్మవీరుడికీ మధ్య ఒక ఉమ్మడిధ్యేయానికి, సౌభ్రాతృత్వానికీ సంబంధించిన మహత్తర ఆధ్యాత్మిక బంధం స్థిరపడింది. వారు గొప్ప మిత్రులు. ఒకరినొకరు దాదాపు ప్రేమికుల్లాగా ఆరాధించుకున్నారు. కానీ వారి వ్యక్తిత్వ లక్షణాలు వేరువేరు. వారి జీవిత సాధన కూడా వేరువేరు. భారత ప్రజానీకాన్ని వారు వేరువేరు పద్దతులతో ఆకర్షించారు. ప్రభావితం చేశారు. ఒకరకంగా చెప్పాలంటే వారు ప్రతి ఒక్క విషయంలోనూ భిన్నద్రువాలు. కానీ వారి ఆత్మ ఒక్కటే. వారికీ తమదైన విభిన్న మార్గాల్లోనే తాము నడవవలసి ఉంటుందని తెలుసు. కానీ తమతమ మార్గాలు పరస్పరపూరకాలేనని, తమ దారులు వేరైనా అత్మలోక్కటేనని వారికీ తెలుసు.
వారి మధ్య జరిగిన సంవాదాన్ని ప్రపంచం మరింత విస్తృత స్థాయిలో అర్ధం చేసుకుంటే బాగుంటుంది. కవీశ్వరుడు అన్నిటికన్నా ముందు చింతనాపరుడైన మానవుడనీ, గాంధీజీ కర్మయోగి అనీ మనం గుర్తు పెట్టుకోవాలి. ఆ ఇద్దరూ తమకాలం నాటి భారతీయ సమాజాన్ని తమదైన పద్దతిలో తమదైన క్షేత్రంలో ప్రభావితం చేసి ఉండడం నిజంగానే అధ్బుతమైన విషయం.
వారిద్దరి మధ్య ఎటువంటి విభేదం గానీ, సైద్దాంతికంగా భిన్నద్రుక్పధాలు కానీ లేవని వారి మధ్య నడిచినదంతా వారివారి దృక్కోణాల ప్రాధాన్యాల్ని నొక్కి చెప్పటంలో తలెత్తిన పొరపచ్చాలు మాత్రమేనని మనకి తెలుసు. మహాత్ముడి చేతుల్లో భారతదేశం సురక్షితంగా ఉండగలదన్న విశ్వాసాన్ని టాగోర్ ప్రకటించడంలో ఈ వివాదం ముగిసిపోయింది.
- కాకా కాలేల్కర్
సత్యమొక్కటే, దర్శనాలు వేరు టాగోర్ గాంధీ సంవాదం టాగోర్ ని జాతి ఒక కవివరుడిగా, గురుదేవుడిగా గుర్తుపెట్టుకుంటుంది. గాంధీజిని ఒక కర్మవీరుడిగా, మహాత్ముడిగా అంగీకరించింది. ఆ కవీంద్రునికి, ఆ కర్మవీరుడికీ మధ్య ఒక ఉమ్మడిధ్యేయానికి, సౌభ్రాతృత్వానికీ సంబంధించిన మహత్తర ఆధ్యాత్మిక బంధం స్థిరపడింది. వారు గొప్ప మిత్రులు. ఒకరినొకరు దాదాపు ప్రేమికుల్లాగా ఆరాధించుకున్నారు. కానీ వారి వ్యక్తిత్వ లక్షణాలు వేరువేరు. వారి జీవిత సాధన కూడా వేరువేరు. భారత ప్రజానీకాన్ని వారు వేరువేరు పద్దతులతో ఆకర్షించారు. ప్రభావితం చేశారు. ఒకరకంగా చెప్పాలంటే వారు ప్రతి ఒక్క విషయంలోనూ భిన్నద్రువాలు. కానీ వారి ఆత్మ ఒక్కటే. వారికీ తమదైన విభిన్న మార్గాల్లోనే తాము నడవవలసి ఉంటుందని తెలుసు. కానీ తమతమ మార్గాలు పరస్పరపూరకాలేనని, తమ దారులు వేరైనా అత్మలోక్కటేనని వారికీ తెలుసు. వారి మధ్య జరిగిన సంవాదాన్ని ప్రపంచం మరింత విస్తృత స్థాయిలో అర్ధం చేసుకుంటే బాగుంటుంది. కవీశ్వరుడు అన్నిటికన్నా ముందు చింతనాపరుడైన మానవుడనీ, గాంధీజీ కర్మయోగి అనీ మనం గుర్తు పెట్టుకోవాలి. ఆ ఇద్దరూ తమకాలం నాటి భారతీయ సమాజాన్ని తమదైన పద్దతిలో తమదైన క్షేత్రంలో ప్రభావితం చేసి ఉండడం నిజంగానే అధ్బుతమైన విషయం. వారిద్దరి మధ్య ఎటువంటి విభేదం గానీ, సైద్దాంతికంగా భిన్నద్రుక్పధాలు కానీ లేవని వారి మధ్య నడిచినదంతా వారివారి దృక్కోణాల ప్రాధాన్యాల్ని నొక్కి చెప్పటంలో తలెత్తిన పొరపచ్చాలు మాత్రమేనని మనకి తెలుసు. మహాత్ముడి చేతుల్లో భారతదేశం సురక్షితంగా ఉండగలదన్న విశ్వాసాన్ని టాగోర్ ప్రకటించడంలో ఈ వివాదం ముగిసిపోయింది. - కాకా కాలేల్కర్© 2017,www.logili.com All Rights Reserved.