ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ లోని గిరిజన సంస్కృతి పరిశోధన, శిక్షణ సంస్థలో 1971 నుండి 2005 వరకు పనిచేశాను. అంతకు ముందు (1968-70), ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఆంత్రపాలజీ విభాగంలో పరిశోధన విద్యార్థిగా ఉన్నాను. 197071 లో కేంద్ర గ్రామీణాభివృద్ధి సంస్థ (ఇప్పుడు NIRD & PR) లో ఒక ముఖ్యమైన ప్రాజెక్టులో పరిశోధనా సహాయకుడుగా ఉన్నాను. గిరిజన సంస్కృతి పరిశోధన, శిక్షణ సంస్థలో పనిచేస్తున్న సమయంలోనే జిల్లా గిరిజన సంక్షేమ అధికారి, ఏటూరు నాగారం (1986-87), అదనపు ప్రాజెక్టు అధికారి, ఐటిడిఎ, ఉట్నూర్ (1987-88), ప్రథమ ప్రాజెక్టు అధికారి, ఐటిడిఎ - ఆదిమ చెంచు, శ్రీశైలం (1988-89) గా పనిచేశాను. ఆ తరువాత గురుకులం (గిరిజన గురుకుల పాఠశాలల సొసైటీ) కి వ్యవస్థాపక జాయింట్ సెక్రటరీగా మూడు సంవత్సరాలు పనిచేశాను. మధ్యలో ట్రెకార్ జనరల్ మేనేజర్ గాను, టి.సి.ఆర్.టి.ఐ., భద్రాచలంలో జాయింట్ డైరెక్టర్ గాను అదనపు భాద్యతలు నిర్వహించాను.
అక్టోబర్ 2005 లో టి.సి.ఆర్.టి.ఐ. డైరెక్టర్ గా రిటైర్ అయిన తరువాత అటవీ శాఖ, సెక్రటేరియట్ జిఏడి, గ్రామీణాభివృద్ధి శాఖ, విద్యా శాఖ, సెస్, నాల్సార్, స్వచ్చంద సంస్థలకు సలహాదారుడిగా పనిచేశాను. వెరసి గిరిజనులు, గిరిజన ప్రాంతాలతో సంబంధం 52 సంవత్సరాలు పూర్తి అయినాయి. గిరిజన సమస్యల మీద ఇప్పటికే 9 పుస్తకాలు రాశాను. ఇప్పుడు గిరిజనాభ్యుదయంలో సవాళ్ళు మీద ఈ పుస్తకంలో రాస్తున్నాను.
ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ లోని గిరిజన సంస్కృతి పరిశోధన, శిక్షణ సంస్థలో 1971 నుండి 2005 వరకు పనిచేశాను. అంతకు ముందు (1968-70), ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఆంత్రపాలజీ విభాగంలో పరిశోధన విద్యార్థిగా ఉన్నాను. 197071 లో కేంద్ర గ్రామీణాభివృద్ధి సంస్థ (ఇప్పుడు NIRD & PR) లో ఒక ముఖ్యమైన ప్రాజెక్టులో పరిశోధనా సహాయకుడుగా ఉన్నాను. గిరిజన సంస్కృతి పరిశోధన, శిక్షణ సంస్థలో పనిచేస్తున్న సమయంలోనే జిల్లా గిరిజన సంక్షేమ అధికారి, ఏటూరు నాగారం (1986-87), అదనపు ప్రాజెక్టు అధికారి, ఐటిడిఎ, ఉట్నూర్ (1987-88), ప్రథమ ప్రాజెక్టు అధికారి, ఐటిడిఎ - ఆదిమ చెంచు, శ్రీశైలం (1988-89) గా పనిచేశాను. ఆ తరువాత గురుకులం (గిరిజన గురుకుల పాఠశాలల సొసైటీ) కి వ్యవస్థాపక జాయింట్ సెక్రటరీగా మూడు సంవత్సరాలు పనిచేశాను. మధ్యలో ట్రెకార్ జనరల్ మేనేజర్ గాను, టి.సి.ఆర్.టి.ఐ., భద్రాచలంలో జాయింట్ డైరెక్టర్ గాను అదనపు భాద్యతలు నిర్వహించాను. అక్టోబర్ 2005 లో టి.సి.ఆర్.టి.ఐ. డైరెక్టర్ గా రిటైర్ అయిన తరువాత అటవీ శాఖ, సెక్రటేరియట్ జిఏడి, గ్రామీణాభివృద్ధి శాఖ, విద్యా శాఖ, సెస్, నాల్సార్, స్వచ్చంద సంస్థలకు సలహాదారుడిగా పనిచేశాను. వెరసి గిరిజనులు, గిరిజన ప్రాంతాలతో సంబంధం 52 సంవత్సరాలు పూర్తి అయినాయి. గిరిజన సమస్యల మీద ఇప్పటికే 9 పుస్తకాలు రాశాను. ఇప్పుడు గిరిజనాభ్యుదయంలో సవాళ్ళు మీద ఈ పుస్తకంలో రాస్తున్నాను.