ఈ వందేళ్ళ సినిమా చరిత్రలో ఎందరో స్త్రీ మూర్తులు సినిమాకు సంబంధించిన అన్ని రంగాలలో ప్రధాన భూమికలను పోషిస్తూ వస్తున్నారు. వారి పాత్ర అనన్యమైనది. ఈ వందేళ్ళ సినిమా సౌధానికి రాళ్లెత్తిన వారిలో మహిళా కార్మికులు అసామాన్య పాత్రను పోషించారు. అప్పటినుంచి ఇప్పటివరకూ స్త్రీ పాత్రలేని సినిమాయే లేదు. రాను రాను సినిమా తొలి నాటి సామాజిక స్పృహ నుండి భారతీయ సినిమా నేడు గ్లామర్ వైపుకు మలుపు తిరిగింది. గ్లామర్ అంటే స్త్రీ. స్త్రీ అంటే ప్రక్రుతి అందచందాలన్ని హిరోయిన్ లోనే చూస్తున్నారు. ఇప్పుడైతే ఈ గ్లామర్ వెర్రితలలు వేస్తోందికాని నిన్న మొన్నటి వరకు సినిమాలోని స్త్రీ గౌరవప్రదంగానే ఉండేది.
'సీతారాములు'లో సీత లేకుండా రాముని, పార్వతి పరమేశ్వరులో పార్వతి లేకుండా శివుని, రాధాకృష్ణుడులో రాధా లేకుండా కృష్ణున్ని, ఊహించుకోలేము. కేవలం నటనాపరంగానే గాక, సాంకేతిక పరంగాను, దర్శకురాలిగా, రచయిత్రిగా మగానితో సమాన ప్రతిపత్తిలో స్త్రీ నేడు వుంది. సినిమా రంగాన స్త్రీ పాత్రను కాదనేవాళ్ళెవరుంటారు? తక్కువచేసి మాట్లాడే ధైర్యమెవరికి ఉంటుంది?
అయితే ఇంత మహావైభోగమైన స్థితిలో కూడా మరో వైపుకు చుస్తే విగత జీవులైన స్త్రీలు ఎందరో! విషాద రాగాలాపన చేస్తున్న స్త్రీలు ఎందరో! పురుషునికి 'జన్మస్థాన'మైన స్త్రీకి ఎన్ని అగచాట్లో?
- పసుపులేటి రామారావు
పసుపులేటి రామారావు అనగానే సినిమాలు చూసే సినిమా పత్రికలు చదివే ప్రతిఒక్కరికీ ఈ పేరు చాలాసార్లు విన్నాను అనిపిస్తుంది. నిజం! 40 ఏళ్ళుగా సినిమా జర్నలిజంలో ఒకే స్థాయిలో వినిపించే పేరు పసుపులేటి రామారావు. కమ్యునిస్టు వాదం, జర్నలిస్టుకి అర్ధం, నిజాయితీకి అర్ధం ఈ పసుపులేటి రామారావు. 40 ఏళ్ళుగా సైకిల్ యాత్ర, భుజం మీద నుంచీ మోత తప్ప వేరే గెటప్ లో ఎవరూ చూసి ఉండరు. సహజంగా కళాకారులలో, రాజకీయవాదుల్లోను, జర్నలిస్టుల్లోను, ఒకరిమీద ఒకరు బురద చల్లుతూ ఉంటారు. ఏనాడు ఎవరితోనూ బురద చల్లించుకొని చల్లని వ్యక్తీ రామారావు. అతను ఏం రాసినా నిజాయితీగా రాస్తాడు. ఈ పుస్తకంలో కూడా నిజాయితే వుంటుంది. అతని నిజాయితీని అభినందిస్తూ...
- దాసరి నారాయణరావు
సావిత్రిగారు మొదలుకొని మరి కొంతమంది నటీమణుల జీవితాలు చాలా మందికి విలువైన గుణపాఠాలు నేర్పుతాయి. కనుక పసుపులేటి రామారావు అటువంటివారి జీవితాలపై ఈ పుస్తకాన్ని తీసుకురావడం అభినందనీయం.
- కె. చిరంజీవి
ఈ వందేళ్ళ సినిమా చరిత్రలో ఎందరో స్త్రీ మూర్తులు సినిమాకు సంబంధించిన అన్ని రంగాలలో ప్రధాన భూమికలను పోషిస్తూ వస్తున్నారు. వారి పాత్ర అనన్యమైనది. ఈ వందేళ్ళ సినిమా సౌధానికి రాళ్లెత్తిన వారిలో మహిళా కార్మికులు అసామాన్య పాత్రను పోషించారు. అప్పటినుంచి ఇప్పటివరకూ స్త్రీ పాత్రలేని సినిమాయే లేదు. రాను రాను సినిమా తొలి నాటి సామాజిక స్పృహ నుండి భారతీయ సినిమా నేడు గ్లామర్ వైపుకు మలుపు తిరిగింది. గ్లామర్ అంటే స్త్రీ. స్త్రీ అంటే ప్రక్రుతి అందచందాలన్ని హిరోయిన్ లోనే చూస్తున్నారు. ఇప్పుడైతే ఈ గ్లామర్ వెర్రితలలు వేస్తోందికాని నిన్న మొన్నటి వరకు సినిమాలోని స్త్రీ గౌరవప్రదంగానే ఉండేది. 'సీతారాములు'లో సీత లేకుండా రాముని, పార్వతి పరమేశ్వరులో పార్వతి లేకుండా శివుని, రాధాకృష్ణుడులో రాధా లేకుండా కృష్ణున్ని, ఊహించుకోలేము. కేవలం నటనాపరంగానే గాక, సాంకేతిక పరంగాను, దర్శకురాలిగా, రచయిత్రిగా మగానితో సమాన ప్రతిపత్తిలో స్త్రీ నేడు వుంది. సినిమా రంగాన స్త్రీ పాత్రను కాదనేవాళ్ళెవరుంటారు? తక్కువచేసి మాట్లాడే ధైర్యమెవరికి ఉంటుంది? అయితే ఇంత మహావైభోగమైన స్థితిలో కూడా మరో వైపుకు చుస్తే విగత జీవులైన స్త్రీలు ఎందరో! విషాద రాగాలాపన చేస్తున్న స్త్రీలు ఎందరో! పురుషునికి 'జన్మస్థాన'మైన స్త్రీకి ఎన్ని అగచాట్లో? - పసుపులేటి రామారావు పసుపులేటి రామారావు అనగానే సినిమాలు చూసే సినిమా పత్రికలు చదివే ప్రతిఒక్కరికీ ఈ పేరు చాలాసార్లు విన్నాను అనిపిస్తుంది. నిజం! 40 ఏళ్ళుగా సినిమా జర్నలిజంలో ఒకే స్థాయిలో వినిపించే పేరు పసుపులేటి రామారావు. కమ్యునిస్టు వాదం, జర్నలిస్టుకి అర్ధం, నిజాయితీకి అర్ధం ఈ పసుపులేటి రామారావు. 40 ఏళ్ళుగా సైకిల్ యాత్ర, భుజం మీద నుంచీ మోత తప్ప వేరే గెటప్ లో ఎవరూ చూసి ఉండరు. సహజంగా కళాకారులలో, రాజకీయవాదుల్లోను, జర్నలిస్టుల్లోను, ఒకరిమీద ఒకరు బురద చల్లుతూ ఉంటారు. ఏనాడు ఎవరితోనూ బురద చల్లించుకొని చల్లని వ్యక్తీ రామారావు. అతను ఏం రాసినా నిజాయితీగా రాస్తాడు. ఈ పుస్తకంలో కూడా నిజాయితే వుంటుంది. అతని నిజాయితీని అభినందిస్తూ... - దాసరి నారాయణరావు సావిత్రిగారు మొదలుకొని మరి కొంతమంది నటీమణుల జీవితాలు చాలా మందికి విలువైన గుణపాఠాలు నేర్పుతాయి. కనుక పసుపులేటి రామారావు అటువంటివారి జీవితాలపై ఈ పుస్తకాన్ని తీసుకురావడం అభినందనీయం. - కె. చిరంజీవి© 2017,www.logili.com All Rights Reserved.