ఈ చిన్న పుస్తకం - ఒక ఆహార విజ్ఞాన సమాచార పత్రం
మన ఆరోగ్యానికీ, ఆహారానికీ అవినాభావ సంబంధం ఉన్నది. మన జీవితాన్ని నిర్దేశి౦చేది, మనకు రక్షణ కవచంగా ఉండి మన ఆరోగ్యాన్ని సంరక్షించేది మనం తీసుకునే ఆహారమే అన్నది అందరూ అంగీకరించే వాస్తవం. మనం ఆరోగ్యంగా ఉండడానికి, మనుగడ సాగించడానికి అవసరమైన ముడి ఇంధనం మాంసకృతులు, పిండిపదార్థాలు, క్రొవ్వులు, ఖనిజ లవణాలు, విటమిన్లు. వీటిని ఎంత మోతాదులో అవసరమో అంతమేరకే తీసుకోవాలి. అదే సమతుల్య ఆహారం.
మనం తీసుకునే ఆహారంలో సమతుల్యత లోపించడమే అనారోగ్యం. గుండె జబ్బులు, కొలెస్ట్రాల్, మదుమేహంతోసహా అన్ని తరుణ, దీర్ఘ వ్యాధులకూ ఆహారంతో సమతుల్యత లోపించడమే ప్రధాన కారణం. అందువలన మనం తీసుకునే ఆహారం గురించి తెలుగు పాఠకులకు అవగాహన కలిగించే ఒక చిన్న కరపత్రమే ఈ పుస్తకం. ఆ క్రమంలో...
- బియ్యం, గోధుమలు, బార్లీ, రాగులు తదితర దాన్యాహారంలో పోషక విలువలు, ఔషధ గుణాలు.
- కందులు, మినుములు, పెసలు, శెనగలు, బీన్స్, బఠాణీలు, వేరుశనగలు తదితర గింజలు, పప్పులలోని పోషక విలువలు, ఔషధ గుణాలు.
- వివిధ రకాల కాయగూరలు, దుంపకూరలు, ఆకుకూరలలోని పోషక విలువలు, ఔషధ గుణాలు.
- వివిధ రకాల పండ్లు, ఎండు ఫలాలు, తేనె, కొబ్బరి, నువ్వులు మొదలగు విశిష్ట ఆహార పదార్థాలలోని పోషక విలువలు, ఔషధ గుణాలు.
- మాంసకృతులు, పిండిపదార్థాలు, క్రొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాల విశిష్టత.
వివిధ రకాల వ్యాధులు, వాటి నియంత్రణకు అవసరమైన ఆహారం గురించి సమగ్ర సమాచారం ఈ చిరు పుస్తకంలో పొందుపరచబడింది.
- పెండ్యాల సత్యనారాయణ
ఈ చిన్న పుస్తకం - ఒక ఆహార విజ్ఞాన సమాచార పత్రం మన ఆరోగ్యానికీ, ఆహారానికీ అవినాభావ సంబంధం ఉన్నది. మన జీవితాన్ని నిర్దేశి౦చేది, మనకు రక్షణ కవచంగా ఉండి మన ఆరోగ్యాన్ని సంరక్షించేది మనం తీసుకునే ఆహారమే అన్నది అందరూ అంగీకరించే వాస్తవం. మనం ఆరోగ్యంగా ఉండడానికి, మనుగడ సాగించడానికి అవసరమైన ముడి ఇంధనం మాంసకృతులు, పిండిపదార్థాలు, క్రొవ్వులు, ఖనిజ లవణాలు, విటమిన్లు. వీటిని ఎంత మోతాదులో అవసరమో అంతమేరకే తీసుకోవాలి. అదే సమతుల్య ఆహారం. మనం తీసుకునే ఆహారంలో సమతుల్యత లోపించడమే అనారోగ్యం. గుండె జబ్బులు, కొలెస్ట్రాల్, మదుమేహంతోసహా అన్ని తరుణ, దీర్ఘ వ్యాధులకూ ఆహారంతో సమతుల్యత లోపించడమే ప్రధాన కారణం. అందువలన మనం తీసుకునే ఆహారం గురించి తెలుగు పాఠకులకు అవగాహన కలిగించే ఒక చిన్న కరపత్రమే ఈ పుస్తకం. ఆ క్రమంలో... - బియ్యం, గోధుమలు, బార్లీ, రాగులు తదితర దాన్యాహారంలో పోషక విలువలు, ఔషధ గుణాలు. - కందులు, మినుములు, పెసలు, శెనగలు, బీన్స్, బఠాణీలు, వేరుశనగలు తదితర గింజలు, పప్పులలోని పోషక విలువలు, ఔషధ గుణాలు. - వివిధ రకాల కాయగూరలు, దుంపకూరలు, ఆకుకూరలలోని పోషక విలువలు, ఔషధ గుణాలు. - వివిధ రకాల పండ్లు, ఎండు ఫలాలు, తేనె, కొబ్బరి, నువ్వులు మొదలగు విశిష్ట ఆహార పదార్థాలలోని పోషక విలువలు, ఔషధ గుణాలు. - మాంసకృతులు, పిండిపదార్థాలు, క్రొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాల విశిష్టత. వివిధ రకాల వ్యాధులు, వాటి నియంత్రణకు అవసరమైన ఆహారం గురించి సమగ్ర సమాచారం ఈ చిరు పుస్తకంలో పొందుపరచబడింది. - పెండ్యాల సత్యనారాయణ© 2017,www.logili.com All Rights Reserved.