పిల్లల విజయంలో రెండు అంశాలు ప్రధానం. ఒకటి తల్లిదండ్రుల భాగస్వామ్యం, రెండు సరైన చదివే పద్ధతులు. తల్లిదండ్రులు తమ ప్రవర్తన ద్వారా, ప్రతిస్పందనల ద్వారా తమ పిల్లలు అటు చదువులోను, యిటు జీవితంలోనూ సాధించే విజయాలకు లేదా ఎదుర్కొనే వైఫల్యాలకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కారకులు కాగలరు. పిల్లలకు శాస్త్రీయమైన పద్ధతులను ఉపయోగించి చదివే పద్ధతులు తెల్సివుండి, తల్లిదండ్రుల నుంచి సరైన ప్రేరణ లభిస్తే చదువులోనే కాదు, జీవితంలోనూ అద్భుతాలు సాధించగలరు. ఇవే విషయాలను తల్లిదండ్రులతో పంచుకోవడానికి ఉద్దేశించిందే 'పిల్లల విజయంలో తల్లిదండ్రుల భాగస్వామ్యం' అనే ఈ పుస్తకం.
మన విద్యావ్యవస్థ పిల్లల్ని ప్రేరేపించే బదులు, వారిని క్రుంగదిస్తున్నది. సమాజానికి వారిని దగ్గర చేసే బదులు దూరం చేస్తున్నది. సమత్వం బదులు అసమానతలను పెంచుతున్నది. ఎందరిలోనో నిరాశ, నిస్పృహలను కలిగిస్తున్నది. ఈ స్థితిలో 'వ్యవస్థ' లోని లోపాలనుంచి మన పిల్లలను రక్షించుకుంటూ వారిని విజయం వైపు నడిపించడం మనందరి ముందున్న పెద్దసవాలు.
పిల్లలను అటు చదువుల్లోనూ, ఇటు జీవితంలోనూ ఉన్నతంగా తీర్చిదిద్దడం కోసం కేవలం తల్లిదండ్రులకే కాదు, మొత్తం సమాజానికి ఒక చదవదగిన అంశంగా ఈ పుస్తకం ఉపయోగపడుతుంది.
- చుక్కా రామయ్య(MLC & ప్రముఖ విద్యావేత్త)
పిల్లల విజయంలో రెండు అంశాలు ప్రధానం. ఒకటి తల్లిదండ్రుల భాగస్వామ్యం, రెండు సరైన చదివే పద్ధతులు. తల్లిదండ్రులు తమ ప్రవర్తన ద్వారా, ప్రతిస్పందనల ద్వారా తమ పిల్లలు అటు చదువులోను, యిటు జీవితంలోనూ సాధించే విజయాలకు లేదా ఎదుర్కొనే వైఫల్యాలకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కారకులు కాగలరు. పిల్లలకు శాస్త్రీయమైన పద్ధతులను ఉపయోగించి చదివే పద్ధతులు తెల్సివుండి, తల్లిదండ్రుల నుంచి సరైన ప్రేరణ లభిస్తే చదువులోనే కాదు, జీవితంలోనూ అద్భుతాలు సాధించగలరు. ఇవే విషయాలను తల్లిదండ్రులతో పంచుకోవడానికి ఉద్దేశించిందే 'పిల్లల విజయంలో తల్లిదండ్రుల భాగస్వామ్యం' అనే ఈ పుస్తకం. మన విద్యావ్యవస్థ పిల్లల్ని ప్రేరేపించే బదులు, వారిని క్రుంగదిస్తున్నది. సమాజానికి వారిని దగ్గర చేసే బదులు దూరం చేస్తున్నది. సమత్వం బదులు అసమానతలను పెంచుతున్నది. ఎందరిలోనో నిరాశ, నిస్పృహలను కలిగిస్తున్నది. ఈ స్థితిలో 'వ్యవస్థ' లోని లోపాలనుంచి మన పిల్లలను రక్షించుకుంటూ వారిని విజయం వైపు నడిపించడం మనందరి ముందున్న పెద్దసవాలు. పిల్లలను అటు చదువుల్లోనూ, ఇటు జీవితంలోనూ ఉన్నతంగా తీర్చిదిద్దడం కోసం కేవలం తల్లిదండ్రులకే కాదు, మొత్తం సమాజానికి ఒక చదవదగిన అంశంగా ఈ పుస్తకం ఉపయోగపడుతుంది. - చుక్కా రామయ్య(MLC & ప్రముఖ విద్యావేత్త)© 2017,www.logili.com All Rights Reserved.