ఈ కధలు కన్నడ అత్యుతమ రచయితల్లో ఒకరైన శ్రీ పి.లంకేశ్. అయన కధలు నేల విడిచి సాము చేయవు . వారి కధల్లోని పాత్రలు అత్యంత సహజంగా ప్రవర్తిస్తాయి . జీవితంలోని కటినమైన వాస్తవాలను, చేదు నిజాలను , బాధలను, అంతులేని దుఃఖాలను,పగలతో రగిలే క్రూరమైన మనుష్యులను, మనిషిలోని పశుత్వాన్ని, అనుచుకున్న కోరికలను, సమాజాన్ని పట్టి పీడించే అంటరానితనాన్ని, మనిషి అంతరంగంలో దాగిన నీచత్వాన్ని - ఇలా ఒకటేమిటి, సమాజపు బహుముఖాలను ప్రతిభావంతంగా ఈ కధల్లో లంకేశ్ చిత్రించరు.
ఈ కధా సంకలనంలోని కధలలోని తీవ్రత పైకి కనిపించకపోయినా ఈ కధల లోతుల్లో కళ్లారా చూసిన, అనుభవించిన విచిత్రమైన బాధలు, జీవించే యాంత్రికతలో పోగొట్టుకుని పోయే సంభంధాల పట్ల సుక్ష్మ వేదన ఈ కధల్లో ఉన్నాయి. 16 కధల ఉత్తమ సంకలనం.
రాళ్ళూ కరిగే వేళ ..... పి. లంకేశ్
అకాడమీ పురస్కారం పొందిన కన్నడ కధా సంకలనం
© 2017,www.logili.com All Rights Reserved.