ఈ కథలు ప్రతి ఒక్కరికి నచ్చుతాయి. ఇతివృత్తం అందరికి తెలిసిందే. మనం ఇళ్ళలో తరుచూ వండుకునే వంటకాల గురించిన విషయాలను ఇక్కడి ఆచార వ్యవహారాలతో కలబోసి ఆసక్తికరంగా మలిచింది. మాండలిక పదజాలంతో ప్రాంతీయ సామెతలు, జాతీయాలను చేర్చి పాత్రోచిత సంభాషణలతో అందంగా వండి వడ్డించింది.
మన పెద్దలు నిర్దేశించిన ఆచారాలు, కట్టుబాట్లు ముందు చూపుతో చేసినవేనని వాటిలో మన శ్రేయస్సు, ఆరోగ్యం ముడిపడి ఉంటాయని ఈ కథలు చెప్పకనే చెబుతాయి. పెద్దలు ఒక పండగ చేసినా, అ పండగ రోజున ఫలానా వంటకాలు వండినా వాటి వెనుక అర్థం పరమార్ధంతో పాటు శాస్త్రీయ దృక్పథం కూడా ఉంటుందని ఈ కథలు చదివితే మనకు అవగతమవుతుంది.
ఆసాంతం చదివాకా ఈ కథల్లో చెప్పిన వంటకాలన్నీ మనమే వండి తిన్నంత అనుభూతితో మనసు పులకరిస్తుంది. తెలియని విషయాలెన్నో నేర్చుకున్న సంతృప్తి లభిస్తుంది.
-ఎన్.సురేఖ.
ఈ కథలు ప్రతి ఒక్కరికి నచ్చుతాయి. ఇతివృత్తం అందరికి తెలిసిందే. మనం ఇళ్ళలో తరుచూ వండుకునే వంటకాల గురించిన విషయాలను ఇక్కడి ఆచార వ్యవహారాలతో కలబోసి ఆసక్తికరంగా మలిచింది. మాండలిక పదజాలంతో ప్రాంతీయ సామెతలు, జాతీయాలను చేర్చి పాత్రోచిత సంభాషణలతో అందంగా వండి వడ్డించింది. మన పెద్దలు నిర్దేశించిన ఆచారాలు, కట్టుబాట్లు ముందు చూపుతో చేసినవేనని వాటిలో మన శ్రేయస్సు, ఆరోగ్యం ముడిపడి ఉంటాయని ఈ కథలు చెప్పకనే చెబుతాయి. పెద్దలు ఒక పండగ చేసినా, అ పండగ రోజున ఫలానా వంటకాలు వండినా వాటి వెనుక అర్థం పరమార్ధంతో పాటు శాస్త్రీయ దృక్పథం కూడా ఉంటుందని ఈ కథలు చదివితే మనకు అవగతమవుతుంది. ఆసాంతం చదివాకా ఈ కథల్లో చెప్పిన వంటకాలన్నీ మనమే వండి తిన్నంత అనుభూతితో మనసు పులకరిస్తుంది. తెలియని విషయాలెన్నో నేర్చుకున్న సంతృప్తి లభిస్తుంది. -ఎన్.సురేఖ.© 2017,www.logili.com All Rights Reserved.