తెలుగువారికే దక్కిన అదృష్టాలలో "బాపురమణ" లు ఒకటి. ఆ ఇద్దరూ చేసే పనులు వేరువేరుగా పైకి కనబడినప్పటికీ జంటకవుల పట్టికలో బేషరతుగా చేర్చదగినవారు. బాపు ఏ గీతగీసినా, రమణ ఏ రాత రాసినా మనం "ఓఖే" అనటమేకానీ, "కానీ"... అనటం లేదు. బహుముఖ ప్రజ్ఞాశాలి బాపు గీసే నిశ్చలన చిత్రాలు, తీసే చలనచిత్రాలు చూడ తీరయినవి. చూసేకొద్దీ చూడబుద్ధి పుట్టించేవి. ఆయన తీసిన సినిమాలన్నీ జనముద్దు కాకపోయినా, వాటిలో ఒక విలక్షణ సౌందర్యం కానవస్తుంది. వాటిలో ఒక్క దృశ్యాన్ని చూసినా - చిత్రీకరించిన విధానం, నేపథ్యసంగీతం - ఇది బాపు సినిమా అని పట్టిస్తుంటాయి.
సాక్షి బాపు మొదటిసినిమా అయినా, అంతకముందు వందలకొలది సినిమాలను శ్రధగా చూసిన అనుభవం అంటా రంగరించి తీశారు. ఆ సాక్షి గురించి రవిచంద్రన్ విశ్లేషణ "మళ్ళీ సాక్షి నామ సంవత్సరం".
తెలుగువారికే దక్కిన అదృష్టాలలో "బాపురమణ" లు ఒకటి. ఆ ఇద్దరూ చేసే పనులు వేరువేరుగా పైకి కనబడినప్పటికీ జంటకవుల పట్టికలో బేషరతుగా చేర్చదగినవారు. బాపు ఏ గీతగీసినా, రమణ ఏ రాత రాసినా మనం "ఓఖే" అనటమేకానీ, "కానీ"... అనటం లేదు. బహుముఖ ప్రజ్ఞాశాలి బాపు గీసే నిశ్చలన చిత్రాలు, తీసే చలనచిత్రాలు చూడ తీరయినవి. చూసేకొద్దీ చూడబుద్ధి పుట్టించేవి. ఆయన తీసిన సినిమాలన్నీ జనముద్దు కాకపోయినా, వాటిలో ఒక విలక్షణ సౌందర్యం కానవస్తుంది. వాటిలో ఒక్క దృశ్యాన్ని చూసినా - చిత్రీకరించిన విధానం, నేపథ్యసంగీతం - ఇది బాపు సినిమా అని పట్టిస్తుంటాయి. సాక్షి బాపు మొదటిసినిమా అయినా, అంతకముందు వందలకొలది సినిమాలను శ్రధగా చూసిన అనుభవం అంటా రంగరించి తీశారు. ఆ సాక్షి గురించి రవిచంద్రన్ విశ్లేషణ "మళ్ళీ సాక్షి నామ సంవత్సరం".© 2017,www.logili.com All Rights Reserved.