Suryuni Needa

By Rama Chandra Mouli (Author)
Rs.150
Rs.150

Suryuni Needa
INR
ETCBKTE118
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         కాకతీయుల పరిపాలన తర్వాత అనేకానేక కారణాలవల్ల తెలంగాణా ఒక దుఖభూమిగా మిగిలిపోయింది. హైదరాబాద్ దేశంగా తన స్వంత సైన్యం, స్వంత కరెన్సీ, స్వంత రైల్వే, తపాలా, జెండా గలిగి నిజాం రాజుల నిరంకుశపాలనలో మ్రగ్గిపోతూ శతాబ్దాలుగా బానిస బ్రతుకులనీడుస్తూన్న జనానికి ఇక తిరుగబడం...ఆయుధాన్ని పట్టి యుద్ధంచేయడం అనివార్యమై.. పోరాటమే ఇక తమ జీవన విధానమని నిర్ధారించుకొని నిజాం పాలకులకూ, ఆయన తొత్తులైన జాగీర్దార్లు, దేశ్ ముఖ్ లు వంటి స్థానిక దోపిడీదార్ల అణచివేతకూ  వ్యతిరేకంగా అక్కడక్కడ వ్యక్తులుగా.. మరికొన్ని చోట్ల సంఘటిత శక్తులుగా తిరుగుబాటును సుదీర్ఘకాలం కొనసాగించి భూమికోసం భుక్తికోసం తరతరాల విముక్తికోసం వందలు వేలుగా తమ త్యాగాలను చేసి మట్టిని నెత్తురుతో తడిపి పునీతం చేసిన పవిత్ర భూమి తెలంగాణా.

          ఐతే...స్వతంత్ర భారతదేశ ప్రజలకన్నా దాదాపు ఒక ఏడాది తర్వాత స్వతంత్రులైన తెలంగాణా ప్రజలు నిజానికి నిజమైన స్వాతంత్ర్యాన్ని పొందనేలేదు. ఆహార్యాన్ని మార్చుకొని అదే భూస్వాములు, జమిందార్లు కాంగ్రెస్ తీర్థాన్ని పుచ్చుకొని.. మళ్ళీ ప్రజాస్వామ్య ముసుగులో దశాబ్దాల దోపిడిని కొనసాగించారు. మళ్ళీ అణచివేత.. వెట్టి చాకిరి.. వీటితో దేశ్శం ఒక చెత్తకుండై..కుళ్ళిపోయింది.

          ఈ పుణ్యభూమిని పరిశుభ్ర ప్రజాక్షేత్రంగా ఎలా పునర్నిర్మించాలి. అనే చింతనతో నిజాయితీ నిండిన పిడికెడుమంది నిజమైన మనుషులు ఈ దేశంలో ఇంకా  తెర వెనుక ఉన్నారు. కొద్దిమందైనా ఈ సమాజ స్వరూప స్వభావాల్ని తప్పనిసరిగా మార్చగలమనే బలమైన సంకల్పంతో వ్యూహాత్మకంగా ముందుకు అడుగులు సంధిస్తే., తప్పక ఈ సమాజం.. ఈ రాష్ట్రం.. ఈ దేశం.. ఒక కొత్త శకంలోకి పయనిస్తుందని విశ్వసిస్తూ..వర్తమాన సంక్లిష్టతలకు ఒక పరిష్కారాన్ని ప్రతిపాదిస్తున్న నవల ఇది.   

                                                                                                      - రామా చంద్రమౌళి 

         కాకతీయుల పరిపాలన తర్వాత అనేకానేక కారణాలవల్ల తెలంగాణా ఒక దుఖభూమిగా మిగిలిపోయింది. హైదరాబాద్ దేశంగా తన స్వంత సైన్యం, స్వంత కరెన్సీ, స్వంత రైల్వే, తపాలా, జెండా గలిగి నిజాం రాజుల నిరంకుశపాలనలో మ్రగ్గిపోతూ శతాబ్దాలుగా బానిస బ్రతుకులనీడుస్తూన్న జనానికి ఇక తిరుగబడం...ఆయుధాన్ని పట్టి యుద్ధంచేయడం అనివార్యమై.. పోరాటమే ఇక తమ జీవన విధానమని నిర్ధారించుకొని నిజాం పాలకులకూ, ఆయన తొత్తులైన జాగీర్దార్లు, దేశ్ ముఖ్ లు వంటి స్థానిక దోపిడీదార్ల అణచివేతకూ  వ్యతిరేకంగా అక్కడక్కడ వ్యక్తులుగా.. మరికొన్ని చోట్ల సంఘటిత శక్తులుగా తిరుగుబాటును సుదీర్ఘకాలం కొనసాగించి భూమికోసం భుక్తికోసం తరతరాల విముక్తికోసం వందలు వేలుగా తమ త్యాగాలను చేసి మట్టిని నెత్తురుతో తడిపి పునీతం చేసిన పవిత్ర భూమి తెలంగాణా.           ఐతే...స్వతంత్ర భారతదేశ ప్రజలకన్నా దాదాపు ఒక ఏడాది తర్వాత స్వతంత్రులైన తెలంగాణా ప్రజలు నిజానికి నిజమైన స్వాతంత్ర్యాన్ని పొందనేలేదు. ఆహార్యాన్ని మార్చుకొని అదే భూస్వాములు, జమిందార్లు కాంగ్రెస్ తీర్థాన్ని పుచ్చుకొని.. మళ్ళీ ప్రజాస్వామ్య ముసుగులో దశాబ్దాల దోపిడిని కొనసాగించారు. మళ్ళీ అణచివేత.. వెట్టి చాకిరి.. వీటితో దేశ్శం ఒక చెత్తకుండై..కుళ్ళిపోయింది.           ఈ పుణ్యభూమిని పరిశుభ్ర ప్రజాక్షేత్రంగా ఎలా పునర్నిర్మించాలి. అనే చింతనతో నిజాయితీ నిండిన పిడికెడుమంది నిజమైన మనుషులు ఈ దేశంలో ఇంకా  తెర వెనుక ఉన్నారు. కొద్దిమందైనా ఈ సమాజ స్వరూప స్వభావాల్ని తప్పనిసరిగా మార్చగలమనే బలమైన సంకల్పంతో వ్యూహాత్మకంగా ముందుకు అడుగులు సంధిస్తే., తప్పక ఈ సమాజం.. ఈ రాష్ట్రం.. ఈ దేశం.. ఒక కొత్త శకంలోకి పయనిస్తుందని విశ్వసిస్తూ..వర్తమాన సంక్లిష్టతలకు ఒక పరిష్కారాన్ని ప్రతిపాదిస్తున్న నవల ఇది.                                                                                                          - రామా చంద్రమౌళి 

Features

  • : Suryuni Needa
  • : Rama Chandra Mouli
  • : Srujana Lokam
  • : ETCBKTE118
  • : Paperback
  • : 170
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Suryuni Needa

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam