మా చెట్టు నీడ, అసలేం జరిగింది.. ఓ పరిశోధన గ్రంథం. రెండున్నర శతాబ్దాలలో జరిగిన చారిత్రిక, స్వాతంత్ర్య, సాంఘిక, రాజకీయ, ఆర్థిక, భాష, సంస్కృతి, సంఘటనల సమాహారం. పాకనాటి వారి ఏడు తరాల జీవన వైఖరి, భారతదేశ రైతు కుటుంబాల జీవన చిత్రం. నీటి పారుదల రంగదర్శిని, తెలుగువారి ఆలోచనల పురోగమనం.
ఈ రచన మనిషిలోని మానవత్వాన్ని, సంకల్పాన్ని, కృషిని, పట్టుదలని, ఆరాటాన్ని, వికాసాన్ని, నిబద్ధతను, ప్రేరణను, దాతృత్వాన్ని వివరించే ప్రయత్నం. విశ్వ మానవ వ్యక్తిత్వం, అభ్యాసం, సామాజిక మనస్తత్వరంగాల పరిచయ సమ్మిళితం.
ఈ పుస్తక కథనం రాజకీయ బానిసత్వానికి, మధ్య తరగతి రైతు కుటుంబాల మానవత్వానికి మధ్య ఉత్కంఠ ఉద్వేగాల వైరుధ్యాలతో ముందుకు సాగుతూ.. ఉత్కృష్టమైన కృష్ణ, గోదావరి నదులతో పెనవేసుకున్న భౌగోళిక చరిత్రను, అత్యుత్తమ హైడ్రాలజీ శాస్త్ర రంగ అభివృద్ధి చిహ్నంగా మారుతున్న పోలవరం ప్రాజెక్ట్ యొక్క రెండు శతాబ్దాల చరిత్రను పాఠకుడి కళ్ళకు కడుతుంది.
సామాన్యుల కోణంలో వాస్తవాలను శోధించి రాసిన ఈ రచన " మా చెట్టు నీడ.. అసలేం జరిగింది" గా మీ ముందుకు ...............
పామిరెడ్డి సుధీర్ రెడ్డి
© 2017,www.logili.com All Rights Reserved.