'భారతీయ చిత్రకళను రచించిన రామారావు గారు భారతీయ చిత్రకళ యొక్క వృద్ది క్షయములను, ఔన్నత్యములు సప్రమాణముగా వారి గ్రంధమునందు వివరించి చిత్రకళాభ్యుదయమునకు ఉపకారమొనరించిరి.' తెలుగు లో తోలి కార్టూనిస్ట్ గా సువిఖ్యాతుడైన తలిశెట్టి రామారావు రచించిన 'భారతీయ చిత్రకళ' పుస్తకానికి కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు పరిచయ వాక్యాలివి. 1930 లో ఆంధ్ర గ్రంధ మండలి ప్రచురించిన ఈ గ్రంధం 83 సంవత్సరాల తర్వాత మళ్ళీ వెలుగు చూసింది. కార్టూనిస్ట్ గానే కాకుండా ఉద్దాతమైన, లోతైన చిత్రకళాకారుణిగా తలిశెట్టి ఈ గ్రంధంలో సాక్షాత్కరిస్తారు. చిత్రలేఖనోదయం, భౌద్దయుగం, అజంతా గుహలు, మొగలు చిత్రాలు వంటి విషయాలకు సంబంధించి 12 అధ్యాయాలు వివరణాత్మకంగా, సచిత్రంగా పొందుపరిచారు. భారతీయ చిత్రకళా వైభవాన్ని ఆవిష్కరించే ఈ అపురూప గ్రంధం మళ్ళీ ఇన్నేళ్ళకు వెలుగు చూసేందుకు శ్రమించిన ముల్లంగి వెంకట రమణారెడ్డి అభినందనీయులు.
- మధునామూర్తి
'భారతీయ చిత్రకళను రచించిన రామారావు గారు భారతీయ చిత్రకళ యొక్క వృద్ది క్షయములను, ఔన్నత్యములు సప్రమాణముగా వారి గ్రంధమునందు వివరించి చిత్రకళాభ్యుదయమునకు ఉపకారమొనరించిరి.' తెలుగు లో తోలి కార్టూనిస్ట్ గా సువిఖ్యాతుడైన తలిశెట్టి రామారావు రచించిన 'భారతీయ చిత్రకళ' పుస్తకానికి కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు పరిచయ వాక్యాలివి. 1930 లో ఆంధ్ర గ్రంధ మండలి ప్రచురించిన ఈ గ్రంధం 83 సంవత్సరాల తర్వాత మళ్ళీ వెలుగు చూసింది. కార్టూనిస్ట్ గానే కాకుండా ఉద్దాతమైన, లోతైన చిత్రకళాకారుణిగా తలిశెట్టి ఈ గ్రంధంలో సాక్షాత్కరిస్తారు. చిత్రలేఖనోదయం, భౌద్దయుగం, అజంతా గుహలు, మొగలు చిత్రాలు వంటి విషయాలకు సంబంధించి 12 అధ్యాయాలు వివరణాత్మకంగా, సచిత్రంగా పొందుపరిచారు. భారతీయ చిత్రకళా వైభవాన్ని ఆవిష్కరించే ఈ అపురూప గ్రంధం మళ్ళీ ఇన్నేళ్ళకు వెలుగు చూసేందుకు శ్రమించిన ముల్లంగి వెంకట రమణారెడ్డి అభినందనీయులు. - మధునామూర్తి© 2017,www.logili.com All Rights Reserved.