ఈ చిరుపోత్తం, ఆరు ఖండికలుగా విభజింపబడింది. ఇందులో మొదటిది తెలుగుశబ్దోత్పతి, ఇందులో తెలుగు, తెనుగు నే మాటలు ఎట్లా పుట్టాయి, కాలక్రమేణా వచ్చిన మార్పులు మొదలైనవి వివరించబడినాయి. రెండవది ఆంధ్రము,జెంటూ, తెలుగు భాషను ఆంధ్ర శబ్దాలను అని, పాశ్చత్యులు 'జెంటూ' అని అన్నారు. ఇందులో ఈ రెండు శబ్దాలకు సంబందించిన వివరణమియ్యబడినది. మూడవది 'తెలుగు ప్రశస్తి'. దీనిలో తెలుగు కవిపండితులు, తెలుగువారు కాని ఇతర భారతీయులు, పాశ్చాత్య పండిత పరిశోధకులు తెలుగు గొప్పదనాన్ని గూర్చి పలికిన పలుకులు ఏరి కుర్చబడినాయి. నాలుగవది 'ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్' ఈ మాటను ఎవరన్నారు, ఎందుకన్నారు, వాళ్ళట్లా అనడానికి పురిగోల్పిన కారణాలు, మొదలైన వివరాలతో పాటు కొద్దిగా ఇటాలియన్ భాషా లక్షణాలు, తెలుగుకు ఇంకా దగ్గరగా ఉన్న జపానీసు భాషా లక్షణాలు కూడా చూపించబడినాయి. ఐదవది 'తెలుగు పలుకుల జిలిబిలి నడకలు'. ఈ ఖండికలో అనేకులు తెలుగు భాషను పొగుడుతూ ఉపయోగించిన ముఖ్య విశేషణాలను క్రోడీకరించి వారా మాటలను ప్రయోగించటానికి ప్రేరేపించిన తెలుగు భాషా లక్షణాలను గూర్చి విపులంగా చర్చింపబడినది. ఇందులో చివరి భాగం 'ఈనాటి (దు)స్థితి'. ఈ ఖండికలో ఇటు శ్రీకృష్ణదేవరాయలు గాని, అటు వల్లభారాయుడు గాని శ్రీ నాధుడని గాని కొందరంటారు. 'దేశ భాషలందు తెలుగులెస్స' అనటానికి పురికొల్పిన తెలుగు గుణాలేమిటి అనేది, అప్పయ్య దీక్షితులు వంటి వారు తెలుగును ప్రశంసించటానికి గల కారణాలను వివరించి, వారు సూచించిన ఆనాటి తెలుగు భాషా లక్షణాలు, అర్హతలు ఈనాటి తెలుగుకున్నాయా? అని విచారించటమేకాక, ఈనాటికి తెలుగులో వచ్చిన మార్పులు చేర్పులు, వాటితో తెలుగుభాషలో వచ్చిన తేడాలు నిరూపించటంతో పాటు, ఈ వ్యత్యాసాల వల్ల తెలుగు భాష మౌలిక లక్షణాలు ఎట్లా దెబ్బతింటున్నామో వివరించబడింది.
(ఈ ఆరు ఖండికలు 'నడుస్తున్న చరిత్ర' మాస పత్రికలో 2010 లో 9 నెలలు పాటు ధారావాహికంగా ప్రచురింపబడినాయి.)
రచయిత
ఈ చిరుపోత్తం, ఆరు ఖండికలుగా విభజింపబడింది. ఇందులో మొదటిది తెలుగుశబ్దోత్పతి, ఇందులో తెలుగు, తెనుగు నే మాటలు ఎట్లా పుట్టాయి, కాలక్రమేణా వచ్చిన మార్పులు మొదలైనవి వివరించబడినాయి. రెండవది ఆంధ్రము,జెంటూ, తెలుగు భాషను ఆంధ్ర శబ్దాలను అని, పాశ్చత్యులు 'జెంటూ' అని అన్నారు. ఇందులో ఈ రెండు శబ్దాలకు సంబందించిన వివరణమియ్యబడినది. మూడవది 'తెలుగు ప్రశస్తి'. దీనిలో తెలుగు కవిపండితులు, తెలుగువారు కాని ఇతర భారతీయులు, పాశ్చాత్య పండిత పరిశోధకులు తెలుగు గొప్పదనాన్ని గూర్చి పలికిన పలుకులు ఏరి కుర్చబడినాయి. నాలుగవది 'ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్' ఈ మాటను ఎవరన్నారు, ఎందుకన్నారు, వాళ్ళట్లా అనడానికి పురిగోల్పిన కారణాలు, మొదలైన వివరాలతో పాటు కొద్దిగా ఇటాలియన్ భాషా లక్షణాలు, తెలుగుకు ఇంకా దగ్గరగా ఉన్న జపానీసు భాషా లక్షణాలు కూడా చూపించబడినాయి. ఐదవది 'తెలుగు పలుకుల జిలిబిలి నడకలు'. ఈ ఖండికలో అనేకులు తెలుగు భాషను పొగుడుతూ ఉపయోగించిన ముఖ్య విశేషణాలను క్రోడీకరించి వారా మాటలను ప్రయోగించటానికి ప్రేరేపించిన తెలుగు భాషా లక్షణాలను గూర్చి విపులంగా చర్చింపబడినది. ఇందులో చివరి భాగం 'ఈనాటి (దు)స్థితి'. ఈ ఖండికలో ఇటు శ్రీకృష్ణదేవరాయలు గాని, అటు వల్లభారాయుడు గాని శ్రీ నాధుడని గాని కొందరంటారు. 'దేశ భాషలందు తెలుగులెస్స' అనటానికి పురికొల్పిన తెలుగు గుణాలేమిటి అనేది, అప్పయ్య దీక్షితులు వంటి వారు తెలుగును ప్రశంసించటానికి గల కారణాలను వివరించి, వారు సూచించిన ఆనాటి తెలుగు భాషా లక్షణాలు, అర్హతలు ఈనాటి తెలుగుకున్నాయా? అని విచారించటమేకాక, ఈనాటికి తెలుగులో వచ్చిన మార్పులు చేర్పులు, వాటితో తెలుగుభాషలో వచ్చిన తేడాలు నిరూపించటంతో పాటు, ఈ వ్యత్యాసాల వల్ల తెలుగు భాష మౌలిక లక్షణాలు ఎట్లా దెబ్బతింటున్నామో వివరించబడింది. (ఈ ఆరు ఖండికలు 'నడుస్తున్న చరిత్ర' మాస పత్రికలో 2010 లో 9 నెలలు పాటు ధారావాహికంగా ప్రచురింపబడినాయి.) రచయితcreating interest on Telugu language
© 2017,www.logili.com All Rights Reserved.