ఇప్పటి తమిళనాడులో వక్కణపు పక్కన, ఇప్పటి ఆంద్రనాడుకు చిట్టచివరి కొసన నిలిచి ఉంది తొండనాడు.
తొండనాడు ఎన్నో తనికా(ప్రత్యేకత)లకు తావు. బారతనాడులో పేరు పొందిన కంచి పట్టు ఇక్కడిదే. ఆరణి, పెదపాళెం పట్టుకోకలు ఇక్కడివే... కాళహస్తి కలంకారీ, మాదవమాల కొయ్యబొమ్మలు, కంచి కంచుగిన్నెలు పేరు పొందినవి. తెక్కణ బారతంలో పెద్ద నగరమయిన చెన్నపట్టణం, ప్రానగరంగా పేరు గడిరచిన కంచి, ప్రపంచం నలుమూలలకూ తెలిసిన తిరుపతి వంటి ఊర్లున్న తావు ఇది. పంచబూత లింగాలలో నాలుగూ(కంచి, కాళహస్తి, తిరువణ్ణామల, చిదంబరం), 108 దివ్య తిరుపతులలో ఇరవయి ఎనిమిది నెలకొని ఉన్నది ఇక్కడే. రామానుజుడు పుట్టిందీ రమణుడూ అరవిందుడూ కుదురుకొన్న తావు ఇదే.
తొండనాడులోని అన్ని తావుల్లోనూ ఒకప్పుడు తెలుగుబడులు ఉండేవి. ఇప్పుడు ఆంద్రనాడు తావును తప్పిస్తే, తమిళనాడు ఎల్లలో చెన్నపట్నమూ తిరువళ్లూరు పెవ్వంటెంలలో మట్టుకే ఉన్నాయి. ఆంద్రనాడులో వాడుతున్న ఎన్నో ఇంగిలీసు, ఉరుదూ, సముసుక్రుతపు మాటలకు ఈ తావున తెలుగుమాటలు వాడుకలో ఉన్నాయి. ఆ మాటలు అచ్చులోకి రావాలంటే తొండనాడంతా తెలుగురాతలు తెలి యాలి. ‘తొరసం’ ఆ పనినే మొదలు పెట్టింది.
తెలుగు వాళ్లున్న పల్లెల్లో తెలుగు రాతల్ని నేరిపిస్తూ, వాళ్ల చేతనే వాళ్ల బతుకులను వాళ్ల తెలుగులో రాయించాలని ‘తొరసం గురి. తొండనాడు బతుకుల్ని ఇతర తావుల వాళ్లకు పరిచయం చేయాలని మా తపన. ఇది మా తొలి పూనిక. ఇందులో తొండనాడు ఎల్లలో వచ్చిన తెలుగుకతలనుంచి ఇరవయి కతలనూ, తమిళకతల నుంచి ఇరవయి కతలనూ ఎంపిక చేసి ఈ నోయిని మీ ముందుకు తెస్తున్నాము. మా పూనికలో లోటుపాట్లు ఉంటే తెలియ చేయండి, సరిదిద్దుకొంటాము. ఇది మీకు నచ్చుతుందనే మా నమ్మకం.
- స.వెం.రమేశ్
ఇప్పటి తమిళనాడులో వక్కణపు పక్కన, ఇప్పటి ఆంద్రనాడుకు చిట్టచివరి కొసన నిలిచి ఉంది తొండనాడు. తొండనాడు ఎన్నో తనికా(ప్రత్యేకత)లకు తావు. బారతనాడులో పేరు పొందిన కంచి పట్టు ఇక్కడిదే. ఆరణి, పెదపాళెం పట్టుకోకలు ఇక్కడివే... కాళహస్తి కలంకారీ, మాదవమాల కొయ్యబొమ్మలు, కంచి కంచుగిన్నెలు పేరు పొందినవి. తెక్కణ బారతంలో పెద్ద నగరమయిన చెన్నపట్టణం, ప్రానగరంగా పేరు గడిరచిన కంచి, ప్రపంచం నలుమూలలకూ తెలిసిన తిరుపతి వంటి ఊర్లున్న తావు ఇది. పంచబూత లింగాలలో నాలుగూ(కంచి, కాళహస్తి, తిరువణ్ణామల, చిదంబరం), 108 దివ్య తిరుపతులలో ఇరవయి ఎనిమిది నెలకొని ఉన్నది ఇక్కడే. రామానుజుడు పుట్టిందీ రమణుడూ అరవిందుడూ కుదురుకొన్న తావు ఇదే. తొండనాడులోని అన్ని తావుల్లోనూ ఒకప్పుడు తెలుగుబడులు ఉండేవి. ఇప్పుడు ఆంద్రనాడు తావును తప్పిస్తే, తమిళనాడు ఎల్లలో చెన్నపట్నమూ తిరువళ్లూరు పెవ్వంటెంలలో మట్టుకే ఉన్నాయి. ఆంద్రనాడులో వాడుతున్న ఎన్నో ఇంగిలీసు, ఉరుదూ, సముసుక్రుతపు మాటలకు ఈ తావున తెలుగుమాటలు వాడుకలో ఉన్నాయి. ఆ మాటలు అచ్చులోకి రావాలంటే తొండనాడంతా తెలుగురాతలు తెలి యాలి. ‘తొరసం’ ఆ పనినే మొదలు పెట్టింది. తెలుగు వాళ్లున్న పల్లెల్లో తెలుగు రాతల్ని నేరిపిస్తూ, వాళ్ల చేతనే వాళ్ల బతుకులను వాళ్ల తెలుగులో రాయించాలని ‘తొరసం గురి. తొండనాడు బతుకుల్ని ఇతర తావుల వాళ్లకు పరిచయం చేయాలని మా తపన. ఇది మా తొలి పూనిక. ఇందులో తొండనాడు ఎల్లలో వచ్చిన తెలుగుకతలనుంచి ఇరవయి కతలనూ, తమిళకతల నుంచి ఇరవయి కతలనూ ఎంపిక చేసి ఈ నోయిని మీ ముందుకు తెస్తున్నాము. మా పూనికలో లోటుపాట్లు ఉంటే తెలియ చేయండి, సరిదిద్దుకొంటాము. ఇది మీకు నచ్చుతుందనే మా నమ్మకం. - స.వెం.రమేశ్© 2017,www.logili.com All Rights Reserved.