మహాభారతం పంచమవేదం, విజ్ఞాన సర్వస్వం, వ్యాసప్రోక్తమైన ఈ మహాగ్రంథం సంస్కృతం నుండి శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారు సరళమైన చక్కని వ్యావహారికాంధ్రంలో అనువదించారు.
ఆంధ్రజాతిని ఉజ్జీవింపజేయడం కోసమే నన్నయ భట్టు వ్యాస భారతం తెలుగు చేశారు. అదే మహాశయంతోనే శాస్త్రిగారు కూడా దీన్ని వ్యావహారికంలో రాశారు.
మహాభారతం ప్రవృత్తికీ సంబంధించినది. సంసారం మహాసముద్రం అయితే, యిదొక గొప్ప ఓడ. మళ్ళి మళ్ళీ చదివి బాగా అవగాహన చేసుకున్న మనిషికెన్నడూ పతనం సంభవించదు. అపజయం తటస్థించదు. జీవితం రసబంధురమై నిరాఘాటంగా సాగిపోతుంది.
ఈ గ్రంధంలో మహాభారతంలోని విరాటపర్వం(నర్తనశాల) వుంది. విరాటపర్వం కధ ఆధారంగానే నటరత్న ఎన్.టి.ఆర్. అర్జునుడుగా, నటసార్వభౌమ ఎస్.వి.ఆర్. కీచకుడుగా, మహానటి సావిత్రి ద్రౌపదిగా "నర్తనశాల" సినిమా వెలువడి అఖిలాంద్ర ప్రేక్షకుల ఆదరాభిమానాలు అందుకుంది.
ఇప్పటికి మన గ్రామీణ ప్రాంతాల్లో వర్షాలు రానప్పుడు విరాటపర్వం చదివిస్తే వర్షాలు కురుస్తాయనే నమ్మకం వుంది. ఆ విధంగా విరాటపర్వం చదివినా, విన్నా, ఇంట్లో వుంచుకున్నా శుభం జరుగుతుందని ఆంధ్రుడైన ప్రతివారికీ తెలుసు.
మహాభారతం పంచమవేదం, విజ్ఞాన సర్వస్వం, వ్యాసప్రోక్తమైన ఈ మహాగ్రంథం సంస్కృతం నుండి శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారు సరళమైన చక్కని వ్యావహారికాంధ్రంలో అనువదించారు. ఆంధ్రజాతిని ఉజ్జీవింపజేయడం కోసమే నన్నయ భట్టు వ్యాస భారతం తెలుగు చేశారు. అదే మహాశయంతోనే శాస్త్రిగారు కూడా దీన్ని వ్యావహారికంలో రాశారు. మహాభారతం ప్రవృత్తికీ సంబంధించినది. సంసారం మహాసముద్రం అయితే, యిదొక గొప్ప ఓడ. మళ్ళి మళ్ళీ చదివి బాగా అవగాహన చేసుకున్న మనిషికెన్నడూ పతనం సంభవించదు. అపజయం తటస్థించదు. జీవితం రసబంధురమై నిరాఘాటంగా సాగిపోతుంది. ఈ గ్రంధంలో మహాభారతంలోని విరాటపర్వం(నర్తనశాల) వుంది. విరాటపర్వం కధ ఆధారంగానే నటరత్న ఎన్.టి.ఆర్. అర్జునుడుగా, నటసార్వభౌమ ఎస్.వి.ఆర్. కీచకుడుగా, మహానటి సావిత్రి ద్రౌపదిగా "నర్తనశాల" సినిమా వెలువడి అఖిలాంద్ర ప్రేక్షకుల ఆదరాభిమానాలు అందుకుంది. ఇప్పటికి మన గ్రామీణ ప్రాంతాల్లో వర్షాలు రానప్పుడు విరాటపర్వం చదివిస్తే వర్షాలు కురుస్తాయనే నమ్మకం వుంది. ఆ విధంగా విరాటపర్వం చదివినా, విన్నా, ఇంట్లో వుంచుకున్నా శుభం జరుగుతుందని ఆంధ్రుడైన ప్రతివారికీ తెలుసు.© 2017,www.logili.com All Rights Reserved.