డాక్టర్ల తియ్యటి పలకరింపుతోనే రోగి జబ్బు సగం నయమైపోతుంది అని అంటుంటారు. ఇది అక్షరాలా నిజం. అయితే తియ్యగా, ఆత్మీయంగా పలకరించే స్వభావం ఉన్న డాక్టర్లు ఏ కొద్ది మందో ఉంటారు. అలా౦టి డాక్టర్లలో డా.కె.ఎల్.వి. ప్రసాద్ ఒకరు. గత ఇరవై ఐదేళ్లుగా రేడియోలో, పత్రికల్లో ప్రసాద్ ప్రసంగాలను, వ్యాసాలను మనం వింటున్నాం - చదువుతున్నాం.
ఒక మంచి పుస్తకాన్ని వెలువరిస్తున్నందుకు నేను డాక్టర్ ప్రసాద్ ను అభినందిస్తున్నాను. ఇది ప్రతి ఇంటా ఉండదగిన పుస్తకం. ప్రతి మనిషికీ ఆరోగ్యం పట్ల బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. అందుకు తగిన పుస్తకాలు అందుబాటులో ఉండాలి. 'చిన్నపిల్లలు - దంత సమస్యలు' అనే ఈ పుస్తకం అలాంటిది. అంతేకాదు ఎంతో విలువైనది. చక్కటి దంతాలు ఆరోగ్యాన్నే కాదు, అందాన్నీ, ఆహ్లాదాన్నీ - ఆనందాన్నీ ఇస్తాయి. చక్కటి దంతాలు ఉండాలంటే చిన్నతనంలోనే తగిన జాగ్రత్తలు తెసుకోవాలి. ఈ పుస్తకంలో దంతాల సంరక్షణకు సంబంధించిన పూర్తి సమాచారం నిక్షిప్తమై ఉంది. పిన్నలకు, పెద్దలకు ఉపయోగపడే మంచి పుస్తకం. ప్రతి ఇంటా ఉండదగ్గదీ, తరతరాలు దాచుకోదగ్గదీ అయిన ఇంత మంచి పుస్తకాన్ని ప్రజలకందిస్తున్నందుకు మా ప్రసాద్ ను మరోసారి మనసారా అభినందిస్తూ....
- పాలకుర్తి మధుసూదనరావు
డాక్టర్ల తియ్యటి పలకరింపుతోనే రోగి జబ్బు సగం నయమైపోతుంది అని అంటుంటారు. ఇది అక్షరాలా నిజం. అయితే తియ్యగా, ఆత్మీయంగా పలకరించే స్వభావం ఉన్న డాక్టర్లు ఏ కొద్ది మందో ఉంటారు. అలా౦టి డాక్టర్లలో డా.కె.ఎల్.వి. ప్రసాద్ ఒకరు. గత ఇరవై ఐదేళ్లుగా రేడియోలో, పత్రికల్లో ప్రసాద్ ప్రసంగాలను, వ్యాసాలను మనం వింటున్నాం - చదువుతున్నాం. ఒక మంచి పుస్తకాన్ని వెలువరిస్తున్నందుకు నేను డాక్టర్ ప్రసాద్ ను అభినందిస్తున్నాను. ఇది ప్రతి ఇంటా ఉండదగిన పుస్తకం. ప్రతి మనిషికీ ఆరోగ్యం పట్ల బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. అందుకు తగిన పుస్తకాలు అందుబాటులో ఉండాలి. 'చిన్నపిల్లలు - దంత సమస్యలు' అనే ఈ పుస్తకం అలాంటిది. అంతేకాదు ఎంతో విలువైనది. చక్కటి దంతాలు ఆరోగ్యాన్నే కాదు, అందాన్నీ, ఆహ్లాదాన్నీ - ఆనందాన్నీ ఇస్తాయి. చక్కటి దంతాలు ఉండాలంటే చిన్నతనంలోనే తగిన జాగ్రత్తలు తెసుకోవాలి. ఈ పుస్తకంలో దంతాల సంరక్షణకు సంబంధించిన పూర్తి సమాచారం నిక్షిప్తమై ఉంది. పిన్నలకు, పెద్దలకు ఉపయోగపడే మంచి పుస్తకం. ప్రతి ఇంటా ఉండదగ్గదీ, తరతరాలు దాచుకోదగ్గదీ అయిన ఇంత మంచి పుస్తకాన్ని ప్రజలకందిస్తున్నందుకు మా ప్రసాద్ ను మరోసారి మనసారా అభినందిస్తూ.... - పాలకుర్తి మధుసూదనరావు© 2017,www.logili.com All Rights Reserved.