మీ పాపకి మీ పాలే ముఖ్యం
అవునండి పిల్లలకి తల్లి పాలే శ్రేష్ఠం. చంటి పిల్లలకు నెల వరకూ తల్లి పాలు అవసరంతోపటు ఆరోగ్యం కూడా. ఆ నెలల్లో తల్లి పాలు కొలస్ట్రాల్ ఉండటం వాళ్ళ పాలు పసుపు రంగులో ఉంటాయి. కొంతమంది తల్లులు ఈ పాలు మంచివి కావని అపోహపడుతూ ఉంటారు. అది చాలా పొరపాటు. ఆ పాలు పిల్లలకు చెడు చేయవు. పసిబిడ్డకి ఎంతో ఉపకరిస్తాయి. ఆ పాల వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇది ఎంతో మంది డాక్టర్స్ ముక్త కంఠంతో చెబుతున్నమాట! అయిదు నెలల వరకూ తల్లి పాలు ఆపై పాలతోపాటు బాగా ఉడికించిన ఆకు కూరలు, క్యారెట్, అరటి, బొప్పాయి, గుమ్మడికాయ లాంటి ఘన ఆహారం కలిపి పిల్లలకి అందివ్వాలి. అలా పోషక ఆహారం పిల్లలకు ప్రాథమిక దశనుంచే అందించకపోతే అనేక రోగాల బారిన పిల్లలు పడే ప్రమాదం ఉంది.
అందం గురించో మరో కారణంగానో డబ్బా పాలు పట్టడం ద్వారా పాప ఆరోగ్యానికి మీరే చేటు చేసినవారవుతారు. అలాగే సరి అయిన పోషక విలువలు లేని ఆహారం తీసుకోవటం వల్ల ఎన్నో రోగాల బారిన మీరు పడాల్సి వస్తుంది. రోజువారి ఆహారంలో అన్ని రకాల విటమిన్లు లభించకపోతే ఎన్ని రుగ్మతతో ఓసారి గమనించండి.
మీ పాపకి మీ పాలే ముఖ్యం అవునండి పిల్లలకి తల్లి పాలే శ్రేష్ఠం. చంటి పిల్లలకు నెల వరకూ తల్లి పాలు అవసరంతోపటు ఆరోగ్యం కూడా. ఆ నెలల్లో తల్లి పాలు కొలస్ట్రాల్ ఉండటం వాళ్ళ పాలు పసుపు రంగులో ఉంటాయి. కొంతమంది తల్లులు ఈ పాలు మంచివి కావని అపోహపడుతూ ఉంటారు. అది చాలా పొరపాటు. ఆ పాలు పిల్లలకు చెడు చేయవు. పసిబిడ్డకి ఎంతో ఉపకరిస్తాయి. ఆ పాల వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇది ఎంతో మంది డాక్టర్స్ ముక్త కంఠంతో చెబుతున్నమాట! అయిదు నెలల వరకూ తల్లి పాలు ఆపై పాలతోపాటు బాగా ఉడికించిన ఆకు కూరలు, క్యారెట్, అరటి, బొప్పాయి, గుమ్మడికాయ లాంటి ఘన ఆహారం కలిపి పిల్లలకి అందివ్వాలి. అలా పోషక ఆహారం పిల్లలకు ప్రాథమిక దశనుంచే అందించకపోతే అనేక రోగాల బారిన పిల్లలు పడే ప్రమాదం ఉంది. అందం గురించో మరో కారణంగానో డబ్బా పాలు పట్టడం ద్వారా పాప ఆరోగ్యానికి మీరే చేటు చేసినవారవుతారు. అలాగే సరి అయిన పోషక విలువలు లేని ఆహారం తీసుకోవటం వల్ల ఎన్నో రోగాల బారిన మీరు పడాల్సి వస్తుంది. రోజువారి ఆహారంలో అన్ని రకాల విటమిన్లు లభించకపోతే ఎన్ని రుగ్మతతో ఓసారి గమనించండి.© 2017,www.logili.com All Rights Reserved.