ప్రకృతి లోని కొన్ని పదార్థాలను ముట్టకుండా ఉంటేనే మంచిది. యురేనియం వాటిలో ఒకటి. అది నేల కింద ఉండిపోవడమే మంచిది. దానిని వెలికితీసి దాని నుండి శక్తిని ఉత్పత్తి చేసే ప్రక్రియలో ప్రాణాంతరకమైన ప్రమాదాలు అసలే జరగకుండా కాపాడడం అసాధ్యం. అది అట్లాగుంచి, ఈ క్రమంలో పెరుగుతూ పోయే వ్యర్థ పదార్థాల అణుధార్మికత నుండి ప్రాణికి రక్షణ లేదు. ప్రపంచంలోని యురేనియం, యురేనియంగా మార్చగల సకల పదార్థాలు ఖర్చయిపోయిన తరువాత కూడ ఈ వ్యర్థ పదార్థాల చెరువులూ గుట్టలూ మిగిలిపోతాయి. శాశ్వతంగా మిగిలిపోతాయి. వాటిని నిరపాయకరంగా మార్చే మార్గమేదీ లేదు. భూమి వాటిని క్యాన్సర్ కురుపులలాగ తన ఒంటిమీద భరిస్తూ బతకాలి. దాని కంటే యురేనియాన్ని నేల కిందే ఉండనిచ్చి ప్రకృతిని పచ్చగా మిగిల్చే జీవన శైలికీ ప్రమాణాలకూ మానవ ఆకాంక్షలను పరిమితం చేసి, ఆ స్థితికి అందరినీ తీసుకొచ్చే మానవీయ విధాన రచన చేపట్టడం చాలా ఉత్తమం.
- కె. బాలగోపాల్