అమరావతి బాలోత్సవం ఆట, పాటలతో కూడిన విద్యా విధానం లక్ష్యంగా పనిచేస్తోంది. చదువుకొనటం (కొనుక్కోవటం) గాక, నేర్చుకునేవిధానం మారాలని అభిలషిస్తోంది. బాల్యం నుండే ప్రశ్నించేతత్వం అలవడాలని కోరుకుంటున్నది. సామాజిక దృష్టి, నైతిక విలువలు, క్రమశిక్షణ, సహకారగుణం, శ్రమించేతత్వం లాంటి లక్షణాలు బాల్య దశనుండే మొగ్గతొడగాలి.
పిల్లల్లో ఆలోచనాశక్తి, అవగాహనా సామర్ధ్యం, తార్కిక దృష్టి ఏర్పడటానికి, దేశభక్తి ప్రేరణకు ఈ పుస్తకం గొప్ప మార్గదర్శి. రచయిత కె. ఎల్. కాంతారావు గారు విద్యుత్ ఇంజనీర్ అయినప్పటికీ, పాఠశాల విద్యార్థులకు అనేకరకాల శిక్షణలు ఇచ్చారు. సమాజంలో బాలల చుట్టూ ఉన్న అనేక అంశాల పట్ల, అభిప్రాయాలపట్ల, శాస్త్రీయదృష్టి ఎంత కొరతగా వుందో అర్థం చేసుకున్నారాయన.
- కె. ఎల్. కాంతారావు