Title | Price | |
Chorabatu | Rs.150 | In Stock |
శిరంశెట్టి కాంతారావు రాసిన పద్దెనిమిది కథల సంపుటం 'చొరబాటు' మనచేతుల్లో ఉంది. మన ప్రాంతానికి చెందినా జీవితాన్నే, మనకు తెలియని, తెలిసినా పట్టించుకోని, ఎన్నో వినాలని కాంతారావు మన ముందుకు తీసుకొచ్చారు. ఈ కథలన్నిటిలోనూ జీవితం ఎలా నడుస్తున్నదో దాఖలా ఉంది. ఎలా నడవకూడదో ఆ ఫిర్యాదూ ఉంది. ఎలా నడిస్తే బావుంటుందో ఆ ఆకాంక్షా ఉంది. ఇంక జీవితం తాను అనుకున్నట్టు నడవడం లేదు కాబట్టి ఒక్కొక్కసారి కథకుడు ఉండబట్టలేక, ఊరుకోలేక సాహసంతోనో, సమయోచితంగానో ఇచ్చేసిన తీర్పు ఉంది. తెగించి చెప్పకుండా ఉండలేని ముగింపు ఉంది.
ఈ కథలు చదవగానే నాకు స్పురించింది, ఇందులోని విస్తృతి. అమెరికాలో రిటైరైన ఉద్యోగి నుంచి, గంగ ఒడ్డున దశాశ్వమేథ్ ఘాట్ లో పడవనడిపే సలీం కాకా మొదలుకొని ఏనాటివాడో ముక్త్యాల రాజాని పెళ్లివిందుకు ఆహ్వానించిన సోమ్లానాయకుడి దాకా ఎందరో మనుషులు. రాజస్థాన్ లోహకారుల నుండి, నెక్కొండ కాటికాపరుల దాకా ఎన్నో వృత్తులు. భర్పూర్ థర్మల్ స్టేషన్ మొదలుకొని పాపికొండల్లో ఆశ్రమపాఠశాల దాకా ఎన్నో సంస్థలు, ప్రతి కొత్త సంస్థ చుట్టూ పిగిలిపోతున్న పాతజీవితం, కొత్త వేదన.
శిరంశెట్టి కాంతారావు రాసిన పద్దెనిమిది కథల సంపుటం 'చొరబాటు' మనచేతుల్లో ఉంది. మన ప్రాంతానికి చెందినా జీవితాన్నే, మనకు తెలియని, తెలిసినా పట్టించుకోని, ఎన్నో వినాలని కాంతారావు మన ముందుకు తీసుకొచ్చారు. ఈ కథలన్నిటిలోనూ జీవితం ఎలా నడుస్తున్నదో దాఖలా ఉంది. ఎలా నడవకూడదో ఆ ఫిర్యాదూ ఉంది. ఎలా నడిస్తే బావుంటుందో ఆ ఆకాంక్షా ఉంది. ఇంక జీవితం తాను అనుకున్నట్టు నడవడం లేదు కాబట్టి ఒక్కొక్కసారి కథకుడు ఉండబట్టలేక, ఊరుకోలేక సాహసంతోనో, సమయోచితంగానో ఇచ్చేసిన తీర్పు ఉంది. తెగించి చెప్పకుండా ఉండలేని ముగింపు ఉంది. ఈ కథలు చదవగానే నాకు స్పురించింది, ఇందులోని విస్తృతి. అమెరికాలో రిటైరైన ఉద్యోగి నుంచి, గంగ ఒడ్డున దశాశ్వమేథ్ ఘాట్ లో పడవనడిపే సలీం కాకా మొదలుకొని ఏనాటివాడో ముక్త్యాల రాజాని పెళ్లివిందుకు ఆహ్వానించిన సోమ్లానాయకుడి దాకా ఎందరో మనుషులు. రాజస్థాన్ లోహకారుల నుండి, నెక్కొండ కాటికాపరుల దాకా ఎన్నో వృత్తులు. భర్పూర్ థర్మల్ స్టేషన్ మొదలుకొని పాపికొండల్లో ఆశ్రమపాఠశాల దాకా ఎన్నో సంస్థలు, ప్రతి కొత్త సంస్థ చుట్టూ పిగిలిపోతున్న పాతజీవితం, కొత్త వేదన.© 2017,www.logili.com All Rights Reserved.