ఈ పుస్తకంలో ముఖ్యంగా గ్రంధ సమీక్షలు ప్రాధాన్యత వహిస్తాయి. మరికొన్ని సాహిత్య సమస్యల పై చర్చ ద్వితీయ స్థానం వహిస్తుంది. ఈ గ్రంధంలో మొత్తం 39 ప్రధాన వ్యాసాలున్నాయి. అన్నీ సాహిత్య సమస్యలపై ఉత్ప్రేరణ కలిగించేవే. దీనితో రాసినంతవరకూ సాహిత్య సమీక్షలు ముగుస్తున్నాయి. మిగిలినదల్లా, ఆధునిక సాహిత్యంలో ప్రముఖులపై పరిశీలనా వ్యాసాలున్నాయి.
ఈ గ్రంధంలో సమకాలీన సాహిత్యానికీ తెరవవలసిన ద్వారాలూ, గావాక్షాలూ స్పష్టంగా తెరవబడుతున్నాయి. "కాలానికి కవిత్వం కాపలా దీపం" అనడంలోనే సమకాలీన సాహిత్యంలోని కాలుష్యాలపై, సౌష్ట్యాలపై, విషమత్వాలపై ఆలోచనాప్రేరకమైన చర్చ సాగుతుంది. ఆ చర్చ ఉత్తరోత్తరా ఉత్తమ సాహిత్య మార్గదర్శిగా రూపొందుతుంది. ఈ ఆశాభావంతోనే నా పాఠకులకు అందిస్తున్నాను. దయతో స్వీకరించి సముచిత కృషి సలపగలరని ఆశిస్తున్నాము.
- ఆవంత్స సోమసుందర్
ఈ పుస్తకంలో ముఖ్యంగా గ్రంధ సమీక్షలు ప్రాధాన్యత వహిస్తాయి. మరికొన్ని సాహిత్య సమస్యల పై చర్చ ద్వితీయ స్థానం వహిస్తుంది. ఈ గ్రంధంలో మొత్తం 39 ప్రధాన వ్యాసాలున్నాయి. అన్నీ సాహిత్య సమస్యలపై ఉత్ప్రేరణ కలిగించేవే. దీనితో రాసినంతవరకూ సాహిత్య సమీక్షలు ముగుస్తున్నాయి. మిగిలినదల్లా, ఆధునిక సాహిత్యంలో ప్రముఖులపై పరిశీలనా వ్యాసాలున్నాయి. ఈ గ్రంధంలో సమకాలీన సాహిత్యానికీ తెరవవలసిన ద్వారాలూ, గావాక్షాలూ స్పష్టంగా తెరవబడుతున్నాయి. "కాలానికి కవిత్వం కాపలా దీపం" అనడంలోనే సమకాలీన సాహిత్యంలోని కాలుష్యాలపై, సౌష్ట్యాలపై, విషమత్వాలపై ఆలోచనాప్రేరకమైన చర్చ సాగుతుంది. ఆ చర్చ ఉత్తరోత్తరా ఉత్తమ సాహిత్య మార్గదర్శిగా రూపొందుతుంది. ఈ ఆశాభావంతోనే నా పాఠకులకు అందిస్తున్నాను. దయతో స్వీకరించి సముచిత కృషి సలపగలరని ఆశిస్తున్నాము. - ఆవంత్స సోమసుందర్© 2017,www.logili.com All Rights Reserved.