విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక సందర్భంలో 'కవిత్వమంటే వర్ణాన' అన్నారు. కవిత్వం లలితకళల్లో ప్రథమ స్థానంలో వుంటుంది. కారణం దాంట్లో అన్ని కళలు కలిసి వుంటాయి. అట్లా అక్షరాలతో బొమ్మలు గీయడం కవులకు చేతనవును. రేణుక అయోలగారు తన కవితలో అద్భుతమైన చిత్రాన్ని సజీవ దృశ్యాన్ని మన ముందుంచారు. ఒక నది తీరాన్ని చిత్రిక పట్టారు.
"బంగారు ధూళిలా
లేత సూర్యకాంతి ప్రసారం
నదిలా ఏటవాలుగా దిగుతోంది
పిల్ల గాలుల గుంపులు
తనవుని చుట్టుకున్నాయి
యోగ సమాధి నుండి
లేచిన మునిలా
నదిలో అలల కదలిక"
మనసులో మెల్లమెల్లగా ఒక్కొక్కటిగా అనుభూతులు రంగులు పులుముకుని రూపొందుతాయి. మొదట బంగారు ధూళిలాంటి లేత సూర్యకాంతి ఏటవాలుగా వాలుతుంది. తరువాత పిల్లగాలుల గుంపులు మన తనువును చుట్టుకుంటాయి. ఇది అనుభూతి చిత్రం. మనసుకు మాత్రమే అనుభూతమయ్యే విషయం. ఆ గాలి తరగలు నది తరంగాలని తాకి నిశ్శబ్దంగా వున్న నది. సమాధి నించి లేచిన మునిలా అలల కదలికలేర్పడతాయంట.
- సౌభాగ్య