1954 నుండి ఏడేళ్ళపాటు ఈమె హైదరాబాదు రేడియో కేంద్రంలో ఉన్నారు. అనౌన్సరుగా ఈ కేంద్రం నుండి ఈమెదే మొదటి స్త్రీ స్వరం. తనకు తగ్గ ఉద్యోగం కాకపోయినా, తన విధులతో సంబంధం లేకపోయినా, అటు రేడియో నాటకాల్లో ఇటు కార్మికుల కార్యక్రమంలో అన్నింటా తానై సొంతఇంటి పనిగా రేడియో జీవితం గడిపింది. 'ఓడ మనిషి', 'లేడీస్ కంపార్టుమెంటు' అన్న వీరి రేడియో నాటకాలు మొదటిసారిగా బాంబుల్లా శ్రోతల మధ్య పేలి రెడియోకే ప్రచారం తెచ్చిపెట్టాయి. రేడియో నటిగా వాయుతరంగాలలో ఆమె కంఠం పోయిన హొయళ్ళు, దాని వెనక ఉన్న రాగ హృదయపుకలకూజితాలు శ్రోతలు ఎన్నటికీ మరువలేనివి.
- ఆనాటి ప్రజాతంత్ర
ఈ సంపుటిలో ముఖ్యంగా పేర్కొనదగినది 'నేనూ - మా అమ్మ' అనే వ్యాసం. అది అనుభవంతో వ్రాసినది గాని, కల్పితరచనలాగ లేదు. చదువుతూవుంటే, మా అమ్మను గురించే వ్రాశారేమో అనిపించింది. వెంటనే మా అమ్మ తలుపుకువచ్చింది. నా కళ్ళు చెమ్మగిల్లాయి.
- కామేశ్వరి
1954 నుండి ఏడేళ్ళపాటు ఈమె హైదరాబాదు రేడియో కేంద్రంలో ఉన్నారు. అనౌన్సరుగా ఈ కేంద్రం నుండి ఈమెదే మొదటి స్త్రీ స్వరం. తనకు తగ్గ ఉద్యోగం కాకపోయినా, తన విధులతో సంబంధం లేకపోయినా, అటు రేడియో నాటకాల్లో ఇటు కార్మికుల కార్యక్రమంలో అన్నింటా తానై సొంతఇంటి పనిగా రేడియో జీవితం గడిపింది. 'ఓడ మనిషి', 'లేడీస్ కంపార్టుమెంటు' అన్న వీరి రేడియో నాటకాలు మొదటిసారిగా బాంబుల్లా శ్రోతల మధ్య పేలి రెడియోకే ప్రచారం తెచ్చిపెట్టాయి. రేడియో నటిగా వాయుతరంగాలలో ఆమె కంఠం పోయిన హొయళ్ళు, దాని వెనక ఉన్న రాగ హృదయపుకలకూజితాలు శ్రోతలు ఎన్నటికీ మరువలేనివి. - ఆనాటి ప్రజాతంత్ర ఈ సంపుటిలో ముఖ్యంగా పేర్కొనదగినది 'నేనూ - మా అమ్మ' అనే వ్యాసం. అది అనుభవంతో వ్రాసినది గాని, కల్పితరచనలాగ లేదు. చదువుతూవుంటే, మా అమ్మను గురించే వ్రాశారేమో అనిపించింది. వెంటనే మా అమ్మ తలుపుకువచ్చింది. నా కళ్ళు చెమ్మగిల్లాయి. - కామేశ్వరి© 2017,www.logili.com All Rights Reserved.