అనంత్ 'రాజీ' అని ఫోన్ లో పలికినప్పుడు అతని గొంతు మృదువుగా ఆమె హృదయాన్ని మీటినట్టుంటుంది. కొత్తజీవం పోసుకున్నంత సంతోషం పొందుతుందామె. "నువ్వు చెప్పు నేనెవర్ని నీకు?" అని అనంత్ అడిగినప్పుడు "మీరు.. మీరు నాకు అన్నీను" అని కాని ఇవాళ మీరు తప్పితే నాకు మరెవ్వరూ లేరని చెప్పుకుంటుంది. సహజంగానే అనంత్ లోని పురుషుడు శారీరక వ్యామోహంతో ఉద్రేకించి ఆమెను వశపరచుకున్నప్పుడు ఆమె అమలిన శృంగారభావనా ప్రపంచం అంతా కుప్పకూలిపోతుంది.
పరాభవ ఉద్రేకంతో అతడిని కసితీరా కొట్టి అంతలోనే "అందరితో పాటు మీరూ నన్నిలా హింసిస్తే ఎలా?" అని భోరునఏడ్చేసి అతని ముందు కూలబడిపోతుంది. ఆమె జీవితం దివ్యగానమై కొండల్లో కోనల్లో విహరిస్తుంది. ఆదర్శాలను సంతరించుకుని జీవితంలో తాను రాజీ పడలేకపోతున్నట్లు అనంత్ కి రాస్తుంది. నవల మొత్తం చదివి ముగించిన తర్వాత చార్లెస్ డికెన్స్, తాల్ స్టాయ్, దోస్తవిస్కీ వంటి మహారచయితల రచన చదివిన అనుభూతి కలుగుతుంది.
అనంత్ 'రాజీ' అని ఫోన్ లో పలికినప్పుడు అతని గొంతు మృదువుగా ఆమె హృదయాన్ని మీటినట్టుంటుంది. కొత్తజీవం పోసుకున్నంత సంతోషం పొందుతుందామె. "నువ్వు చెప్పు నేనెవర్ని నీకు?" అని అనంత్ అడిగినప్పుడు "మీరు.. మీరు నాకు అన్నీను" అని కాని ఇవాళ మీరు తప్పితే నాకు మరెవ్వరూ లేరని చెప్పుకుంటుంది. సహజంగానే అనంత్ లోని పురుషుడు శారీరక వ్యామోహంతో ఉద్రేకించి ఆమెను వశపరచుకున్నప్పుడు ఆమె అమలిన శృంగారభావనా ప్రపంచం అంతా కుప్పకూలిపోతుంది. పరాభవ ఉద్రేకంతో అతడిని కసితీరా కొట్టి అంతలోనే "అందరితో పాటు మీరూ నన్నిలా హింసిస్తే ఎలా?" అని భోరునఏడ్చేసి అతని ముందు కూలబడిపోతుంది. ఆమె జీవితం దివ్యగానమై కొండల్లో కోనల్లో విహరిస్తుంది. ఆదర్శాలను సంతరించుకుని జీవితంలో తాను రాజీ పడలేకపోతున్నట్లు అనంత్ కి రాస్తుంది. నవల మొత్తం చదివి ముగించిన తర్వాత చార్లెస్ డికెన్స్, తాల్ స్టాయ్, దోస్తవిస్కీ వంటి మహారచయితల రచన చదివిన అనుభూతి కలుగుతుంది.© 2017,www.logili.com All Rights Reserved.