ఇంకొక చిత్రము. ఈ నవలలో ప్రధానపాత్ర అయిన పంకజం పుట్టుకచేత వేశ్య. ఈమె నారాయణ వంటి సద్గ్రుహస్థుని ప్రేమించడం అవాంఛనీయమేగాక జుగుప్సాకరము కూడాను. కాని మనసిచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆమె ఉన్నతాదర్శాలు, ఉత్తమ భావాలు, మనలను చకితులను చేస్తవి. ఏహ్యభావం ఎక్కడా పొడచూపదు. ఇటువంటి విచిత్ర వ్యక్తులు ఎక్కడో నూటికికోతికి ఒకరు ఉంటే మనలను ఈ నవల అంతగా ఆకర్షించేది కాదు. ఇటువంటి ప్రవృత్తిగలవారు సర్వకాలంలోనూ ఉంటారు, సర్వసాధారణంగానూ ఉంటారు. అందుచేతనే ఈ చిత్రణకు విశ్వజనీనత్వము సిద్ధించింది. జుగుప్పను కలిగించే వేశ్యజీవితాన్ని తీసుకుని దానిని రమణీయము, సుందరమూ, ఆనందజనకము అయిన వృత్తాంతముగా చేయడంలో ఈ రచయిత్రి ప్రతిభ ప్రదర్శితమౌతూ ఉన్నది.
- మునిమాణిక్యం నరసింహారావు
ఇంకొక చిత్రము. ఈ నవలలో ప్రధానపాత్ర అయిన పంకజం పుట్టుకచేత వేశ్య. ఈమె నారాయణ వంటి సద్గ్రుహస్థుని ప్రేమించడం అవాంఛనీయమేగాక జుగుప్సాకరము కూడాను. కాని మనసిచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆమె ఉన్నతాదర్శాలు, ఉత్తమ భావాలు, మనలను చకితులను చేస్తవి. ఏహ్యభావం ఎక్కడా పొడచూపదు. ఇటువంటి విచిత్ర వ్యక్తులు ఎక్కడో నూటికికోతికి ఒకరు ఉంటే మనలను ఈ నవల అంతగా ఆకర్షించేది కాదు. ఇటువంటి ప్రవృత్తిగలవారు సర్వకాలంలోనూ ఉంటారు, సర్వసాధారణంగానూ ఉంటారు. అందుచేతనే ఈ చిత్రణకు విశ్వజనీనత్వము సిద్ధించింది. జుగుప్పను కలిగించే వేశ్యజీవితాన్ని తీసుకుని దానిని రమణీయము, సుందరమూ, ఆనందజనకము అయిన వృత్తాంతముగా చేయడంలో ఈ రచయిత్రి ప్రతిభ ప్రదర్శితమౌతూ ఉన్నది. - మునిమాణిక్యం నరసింహారావు© 2017,www.logili.com All Rights Reserved.