రావిశాస్త్రి గారు ఎప్పుడు జనంలో, జనంతో ఉంటారు. వాళ్ళతో నిత్యం సంభాషిస్తూ ఉంటారు. ఆయన రచనా వ్యాసంగానికి ఇది జీవధాతువు. నీటిలో చేపలా ఎప్పుడూ సామాన్యులతోనే మసిలేవారాయన. వాస్తవికతాచిత్రణ ఆయన ఆయుపట్టు. ఆయన సాహిత్యంలో కీలకమైన అంశం అదే.
ఈ నాటకం నా గొప్పకి కాని, నాకు ఊసుపోకకాని రాసింది కాదు. ఇందులో జరిగిన అన్యాయాల వంటి అన్యాయాలు నిజజీవితంలో అదేస్థాయిలో నిత్యం జరక్కపోయినా ఏదో ఒక స్థాయిలో మాత్రం నిత్యం జరుగుతూనే వున్నాయి. ప్రస్తుతం మనదేశంలో ప్రతిరోజూ ప్రతిచోటా కూడా ఎందరో కొందరమాయకులు వాళ్ళు చెయ్యని నేరాలకి శిక్షలనుభవించడం జరుగుతోందని నేను ఖచ్చితంగా, ఘంటాపథంగా, చాలెంజి చేసి చెప్పగలను.
కాని, ఆ మాత్రం ఈ మాత్రం డబ్బూ, పలుకుబడీ, పదవీ, హోదా కలవాడెవడూ మాత్రం ఆ పరిస్థితుల్లో పడడు. ఇరుక్కోడు. ఒకవేళ పడినా, ఇరుక్కున్నా పైకి తప్పించుకోగలడు. ఈ పరిస్థితుల్లో ఈ సంఘంలో పేదవాడికి న్యాయం దొరకదు కాక దొరకదు. తనకన్యాయం జరిగితే ఎదుర్కొందికి పేదవాడికీ సంఘంలో అవకాశం లేదుకాక లేదు. ఈ పరిస్థితి మారాలని నాకుంది. అందుకే ఈ నాటకం రాశాను.
- రాచకొండ విశ్వనాథశాస్త్రి
రావిశాస్త్రి గారు ఎప్పుడు జనంలో, జనంతో ఉంటారు. వాళ్ళతో నిత్యం సంభాషిస్తూ ఉంటారు. ఆయన రచనా వ్యాసంగానికి ఇది జీవధాతువు. నీటిలో చేపలా ఎప్పుడూ సామాన్యులతోనే మసిలేవారాయన. వాస్తవికతాచిత్రణ ఆయన ఆయుపట్టు. ఆయన సాహిత్యంలో కీలకమైన అంశం అదే. ఈ నాటకం నా గొప్పకి కాని, నాకు ఊసుపోకకాని రాసింది కాదు. ఇందులో జరిగిన అన్యాయాల వంటి అన్యాయాలు నిజజీవితంలో అదేస్థాయిలో నిత్యం జరక్కపోయినా ఏదో ఒక స్థాయిలో మాత్రం నిత్యం జరుగుతూనే వున్నాయి. ప్రస్తుతం మనదేశంలో ప్రతిరోజూ ప్రతిచోటా కూడా ఎందరో కొందరమాయకులు వాళ్ళు చెయ్యని నేరాలకి శిక్షలనుభవించడం జరుగుతోందని నేను ఖచ్చితంగా, ఘంటాపథంగా, చాలెంజి చేసి చెప్పగలను. కాని, ఆ మాత్రం ఈ మాత్రం డబ్బూ, పలుకుబడీ, పదవీ, హోదా కలవాడెవడూ మాత్రం ఆ పరిస్థితుల్లో పడడు. ఇరుక్కోడు. ఒకవేళ పడినా, ఇరుక్కున్నా పైకి తప్పించుకోగలడు. ఈ పరిస్థితుల్లో ఈ సంఘంలో పేదవాడికి న్యాయం దొరకదు కాక దొరకదు. తనకన్యాయం జరిగితే ఎదుర్కొందికి పేదవాడికీ సంఘంలో అవకాశం లేదుకాక లేదు. ఈ పరిస్థితి మారాలని నాకుంది. అందుకే ఈ నాటకం రాశాను. - రాచకొండ విశ్వనాథశాస్త్రి© 2017,www.logili.com All Rights Reserved.