పెళ్ళికి ముందు ఒక్కక్షణం ఆలోచించి తీసుకునే మంచి నిర్ణయం మిమ్మల్ని పెళ్ళి తరువాత ప్రతిక్షణం ఆనందంగా వుంచుతుంది. సంతోషంగా, సజావుగా మీ వైవాహిక జీవితం వుండాలంటే మీరు ప్రిమారిటల్ కౌన్సిలింగ్ తీసుకోవాలి. కౌన్సిలర్స్ మీకు అందుబాటులో లేకపోతే మీ తాత, బామ్మల పెళ్లి బంధం అనుభవాల్ని సలహాల రూపంలో తీసుకోని పాటించండి. ఒకవేళ దురదృష్టవశాత్తూ మీకు తాత బామ్మలు లాంటి తలపండిన పెద్దలు లేకపోయినా ఏమీ దిగులు పడాల్సిన పనిలేదు. ఈ పుస్తకం మీకొక ప్రిమారిటల్ కౌన్సిలర్ గా పనిచేస్తుంది. మనం వార్తల్లోకి వెళితే, ఈ మధ్య కాలంలో యువతీయువకులు పెళ్ళిచేసుకున్న కొన్ని నెలల్లోపే విడాకులు తీసుకుంటున్నారు. విడాకులు తీసుకోవడానికి కారణాలేంటని ఆ జంటని అడిగితే ఒకరిమీద ఒకరు తప్పుల్ని ఎత్తి చూపుతారు. వీటన్నిటికీ కారణం వాళ్ళు గతంలో తీసుకున్న నిర్ణయాలే అని మనం చెప్పగలం. ఒక నిర్ణయం తీసుకోవడానికి ఒక్కక్షణం చాలు. కాని అది ఎలా తీసుకోవాలో తెలియడం చాలా ముఖ్యం!
రంజిత్ కుమార్ నూకతోటి
పెళ్ళికి ముందు ఒక్కక్షణం ఆలోచించి తీసుకునే మంచి నిర్ణయం మిమ్మల్ని పెళ్ళి తరువాత ప్రతిక్షణం ఆనందంగా వుంచుతుంది. సంతోషంగా, సజావుగా మీ వైవాహిక జీవితం వుండాలంటే మీరు ప్రిమారిటల్ కౌన్సిలింగ్ తీసుకోవాలి. కౌన్సిలర్స్ మీకు అందుబాటులో లేకపోతే మీ తాత, బామ్మల పెళ్లి బంధం అనుభవాల్ని సలహాల రూపంలో తీసుకోని పాటించండి. ఒకవేళ దురదృష్టవశాత్తూ మీకు తాత బామ్మలు లాంటి తలపండిన పెద్దలు లేకపోయినా ఏమీ దిగులు పడాల్సిన పనిలేదు. ఈ పుస్తకం మీకొక ప్రిమారిటల్ కౌన్సిలర్ గా పనిచేస్తుంది. మనం వార్తల్లోకి వెళితే, ఈ మధ్య కాలంలో యువతీయువకులు పెళ్ళిచేసుకున్న కొన్ని నెలల్లోపే విడాకులు తీసుకుంటున్నారు. విడాకులు తీసుకోవడానికి కారణాలేంటని ఆ జంటని అడిగితే ఒకరిమీద ఒకరు తప్పుల్ని ఎత్తి చూపుతారు. వీటన్నిటికీ కారణం వాళ్ళు గతంలో తీసుకున్న నిర్ణయాలే అని మనం చెప్పగలం. ఒక నిర్ణయం తీసుకోవడానికి ఒక్కక్షణం చాలు. కాని అది ఎలా తీసుకోవాలో తెలియడం చాలా ముఖ్యం! రంజిత్ కుమార్ నూకతోటి
© 2017,www.logili.com All Rights Reserved.