1961 లో ఫ్రెంచ్ లో వెలువడి, 1963 లో ఇంగ్లీషులోకి అనువదించబడిన నాటి నుండి ఫ్రాంజ్ ఫనాన్ రచించిన 'రెచెడ్ ఆఫ్ ది అర్త్' ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన పుస్తకం. జాతుల విముక్తి పోరాటాలకు, ప్రజల విప్లవ పోరాటాలకు కూడా అది స్పూర్తిని అందిస్తూ వచ్చింది. ఆఫ్రికా దేశాల్లోని ఉద్యమాలపై, అక్కడి మేధావుల ఆలోచనా సరళిపై వేసిన ప్రభావం అంచనాలకు అందనిది. అమెరికాలో అరవయ్యవ దశాబ్దంలోనే పైకెగసిన నల్లజాతి ఆత్మగౌరవ ఉద్యమానికి సిద్దాంతిక భూమికను అందించిన పుస్తకాల్లో ప్రథమశ్రేణికి చెందిన వాటిలో ఇది ఒకటి.
ఐదున్నర దశాబ్దాలకు పూర్వం వెలువడిన ఈ పుస్తకాన్ని ఇప్పుడు తెలుగులోకి తేవడంలో ఔచిత్యం ఉందా అని ఎవరికైనా సందేహం రావచ్చు. సామ్రాజ్యవాదం ఉన్నంత కాలం, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటాలు ఉన్నంత కాలం ఈ పుస్తకానికి ప్రాసంగికత ఉంటుంది.
- విరసం
1961 లో ఫ్రెంచ్ లో వెలువడి, 1963 లో ఇంగ్లీషులోకి అనువదించబడిన నాటి నుండి ఫ్రాంజ్ ఫనాన్ రచించిన 'రెచెడ్ ఆఫ్ ది అర్త్' ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన పుస్తకం. జాతుల విముక్తి పోరాటాలకు, ప్రజల విప్లవ పోరాటాలకు కూడా అది స్పూర్తిని అందిస్తూ వచ్చింది. ఆఫ్రికా దేశాల్లోని ఉద్యమాలపై, అక్కడి మేధావుల ఆలోచనా సరళిపై వేసిన ప్రభావం అంచనాలకు అందనిది. అమెరికాలో అరవయ్యవ దశాబ్దంలోనే పైకెగసిన నల్లజాతి ఆత్మగౌరవ ఉద్యమానికి సిద్దాంతిక భూమికను అందించిన పుస్తకాల్లో ప్రథమశ్రేణికి చెందిన వాటిలో ఇది ఒకటి. ఐదున్నర దశాబ్దాలకు పూర్వం వెలువడిన ఈ పుస్తకాన్ని ఇప్పుడు తెలుగులోకి తేవడంలో ఔచిత్యం ఉందా అని ఎవరికైనా సందేహం రావచ్చు. సామ్రాజ్యవాదం ఉన్నంత కాలం, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటాలు ఉన్నంత కాలం ఈ పుస్తకానికి ప్రాసంగికత ఉంటుంది. - విరసం© 2017,www.logili.com All Rights Reserved.