కృతి స్వీకరి డాక్టర్ సిస్టర్ మేరీ గౌరీ గారి పరిచయం
తెరిసా మాత కంటె ముందే భారత దేశానికి వచ్చి క్రైస్తవతాత్త్వికసౌరభ సంభరితమైన తన వైద్య వృత్తి ద్వారా రోగులకు నిస్తుల మైన సేవలందించి ధన్యురా లైన విదేశీ మహిళ డాక్టర్ సిస్టర్ మేరీగౌరీ. ఈమె ఆస్ట్రేలియాలోని బిర్ర గుర్రా (Birregurra) లో 1887వ సం|| జూన్ నెల లోని 23వ తేదీని ఎడ్వర్డ్ మార్గరెట్ గౌరీ దంపతులకు జన్మించారు. తల్లిదండ్రులకు కలిగిన తొమ్మిది మంది సంతానంలో ఈమె మూడోబిడ్డ. ఆ కుటుంబం ప్రేమమయ మైన ప్రార్ధనామయమైన సనాతన క్రైస్తవకుటుంబం.
మేరీగౌరీగారికి తల్లి ప్రభావం వలన గాఢ మైన దైవభక్తి అబ్బింది. తల్లి ఉపాధ్యాయురాలు కావడం వలన ఆమె ప్రప్రథమవిద్యాగురువు కూడా తల్లే.
చదువులో ఆమె ప్రజ్ఞను గమనించిన తండ్రి ఆమెను వైద్యశాస్త్రం చదవడానికి ప్రోత్సహించాడు. ఆమె వైద్యవిద్యను పూర్తి చేసి 1910వ సం||లో డా|| మేరీగౌరీగా ప్రపంచానికి పరిచయమ య్యారు
1915లో స్కాట్లండ్ మహిళ ఐన మెక్ లారెన్ చేసిన అసాధారణ కార్యాలను తెలిపే చిన్న పుస్తకం ఆమె చదివారు. ఆ మహిళ తాను క్యాథలిక్ విశ్వాసంలోకి మారిన తరువాత స్త్రీలకోసం వైద్యసేవ చేయడానికి భారతదేశానికి వచ్చింది. ఈ పుస్తకం ఆమెకు తిరుగులేని ప్రేరణ కలిగించింది.
భారతదేశంలో ప్రతి 17,000మంది గర్భిణీ స్త్రీలకు వైద్యసేవలందించేందుకు ఒకే ఒక వైద్మురా లున్న దయనీయ పరిస్థితి ఆమెను మరింత చలింప జేసింది. భారతదేశంలో మతసంబంధిత వైద్యురాలు (Medical Missionary)గా సేవ లందించడమే తన జీవితగమ్యంగా నిర్ణయించుకున్నారు. సన్నిహితుల వివిధ వ్యతిరేకవాదన లేవీ ఆమె నిర్ణయాన్ని మార్చలేక పోయాయి.
1916వ సం|| లో ప్రథమ ప్రపంచయుద్ధం రోజులలో ఫాదర్ లాకింగ్టన్ యస్.జె. (Fr. Lockington S. J.) గారిచే ప్రారంభింపబడిన 'క్యాథలిక్ ఉమెన్స్ సోషల్ గిల్డ్ (Catholic women's Social Guild)కు ప్రధమాధ్యక్షురాలుగా నియమింపబడి జీవితాంతం దానితో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. కార్ఖానాలలో, కార్యాలయాలలో, గృహాలలో పని చేసే స్త్రీల, బాలికల ఆరోగ్యాభి వృద్ధికోసం అలు పెరగని కృషి చేశారు.
సన్నిహితుల వాదనలను లక్ష్యం చేయకుండా 1920 జనవరిలో మెల్ బోర్న్ (Melbourne)............చిటిప్రోలు వేంకటరత్నం
కృతి స్వీకరి డాక్టర్ సిస్టర్ మేరీ గౌరీ గారి పరిచయం తెరిసా మాత కంటె ముందే భారత దేశానికి వచ్చి క్రైస్తవతాత్త్వికసౌరభ సంభరితమైన తన వైద్య వృత్తి ద్వారా రోగులకు నిస్తుల మైన సేవలందించి ధన్యురా లైన విదేశీ మహిళ డాక్టర్ సిస్టర్ మేరీగౌరీ. ఈమె ఆస్ట్రేలియాలోని బిర్ర గుర్రా (Birregurra) లో 1887వ సం|| జూన్ నెల లోని 23వ తేదీని ఎడ్వర్డ్ మార్గరెట్ గౌరీ దంపతులకు జన్మించారు. తల్లిదండ్రులకు కలిగిన తొమ్మిది మంది సంతానంలో ఈమె మూడోబిడ్డ. ఆ కుటుంబం ప్రేమమయ మైన ప్రార్ధనామయమైన సనాతన క్రైస్తవకుటుంబం. మేరీగౌరీగారికి తల్లి ప్రభావం వలన గాఢ మైన దైవభక్తి అబ్బింది. తల్లి ఉపాధ్యాయురాలు కావడం వలన ఆమె ప్రప్రథమవిద్యాగురువు కూడా తల్లే. చదువులో ఆమె ప్రజ్ఞను గమనించిన తండ్రి ఆమెను వైద్యశాస్త్రం చదవడానికి ప్రోత్సహించాడు. ఆమె వైద్యవిద్యను పూర్తి చేసి 1910వ సం||లో డా|| మేరీగౌరీగా ప్రపంచానికి పరిచయమ య్యారు 1915లో స్కాట్లండ్ మహిళ ఐన మెక్ లారెన్ చేసిన అసాధారణ కార్యాలను తెలిపే చిన్న పుస్తకం ఆమె చదివారు. ఆ మహిళ తాను క్యాథలిక్ విశ్వాసంలోకి మారిన తరువాత స్త్రీలకోసం వైద్యసేవ చేయడానికి భారతదేశానికి వచ్చింది. ఈ పుస్తకం ఆమెకు తిరుగులేని ప్రేరణ కలిగించింది. భారతదేశంలో ప్రతి 17,000మంది గర్భిణీ స్త్రీలకు వైద్యసేవలందించేందుకు ఒకే ఒక వైద్మురా లున్న దయనీయ పరిస్థితి ఆమెను మరింత చలింప జేసింది. భారతదేశంలో మతసంబంధిత వైద్యురాలు (Medical Missionary)గా సేవ లందించడమే తన జీవితగమ్యంగా నిర్ణయించుకున్నారు. సన్నిహితుల వివిధ వ్యతిరేకవాదన లేవీ ఆమె నిర్ణయాన్ని మార్చలేక పోయాయి. 1916వ సం|| లో ప్రథమ ప్రపంచయుద్ధం రోజులలో ఫాదర్ లాకింగ్టన్ యస్.జె. (Fr. Lockington S. J.) గారిచే ప్రారంభింపబడిన 'క్యాథలిక్ ఉమెన్స్ సోషల్ గిల్డ్ (Catholic women's Social Guild)కు ప్రధమాధ్యక్షురాలుగా నియమింపబడి జీవితాంతం దానితో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. కార్ఖానాలలో, కార్యాలయాలలో, గృహాలలో పని చేసే స్త్రీల, బాలికల ఆరోగ్యాభి వృద్ధికోసం అలు పెరగని కృషి చేశారు. సన్నిహితుల వాదనలను లక్ష్యం చేయకుండా 1920 జనవరిలో మెల్ బోర్న్ (Melbourne)............చిటిప్రోలు వేంకటరత్నం© 2017,www.logili.com All Rights Reserved.