విజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్న కొద్దీ పాత కాలంలో వింతగా కనిపించినవి అలవాటై పోతుంటాయి. అంతమాత్రాన అవగాహన పెరిగిందనుకుంటే పొరపాటే. ప్రాధమికంగా ధ్వనించే అంశాలను విద్యాధికులైన వారు కూడా విశదంగా చెప్పలేని స్థితి అనేకసార్లు అనుభవంలో ఎదురవుతూనే వుంటుంది. ఇందుకు ఏకైక పరిష్కారం విజ్ఞానాన్ని విస్తరించుకోవడమే . నూతన పోరిశోధనలతో పాటు పునశ్చరణ కూడా ఇందుకు చాలా అవసరం. చెకుముకి సంపాదకులు ఏ. రామచంద్రయ్య "విజ్ఞాన వీచిక" శీర్షికలో వారం వారం ఇచ్చిన సమాధానాలు అత్యంత ఆసక్తికరంగా నడవడమే గాక అవగాహనకు పదును పెట్టేవిగా పాఠకుల మన్నన పొందాయి.