"ఔచిత్య ప్రస్థానము - సూరన కవిత్వము" అనే గ్రంథాన్ని ఇదివరలో వెలువరించాను. అందులో క్షేమేంద్రుని ఔచిత్య సిద్ధాంతాన్ని గూర్చి సమగ్రంగా చర్చించాను. ఔచిత్య రీతులన్నింటికీ సూరన ప్రబంధాల నుండి ఉదాహరణలను చూపాను. ఒక కావ్యాన్ని సమగ్ర ఔచిత్య దృష్టితో ఎలా పరికించాలో తెలియజేయడం కోసం ఈ రెండవ పుస్తకం రాయవలసి వచ్చింది. సూరన కృతులలో "రాఘవ పాండవీయం" కాబట్టి దానిని వదలి మిగిలిన రెండు ప్రబంధాలను ఈ పుస్తకంలో ఔచిత్య దృష్టితో సమీక్షించాను. కళాపూర్ణోదయం, ప్రభావతీ ప్రద్యుమ్నo ప్రసిద్ధ ప్రబంధాలు, ఇదివరలో ఎందరెందరో మహామహులు ఈ ప్రబంధాలలోని ఉత్కృష్ట లక్షణాలను సమీచీనంగా దర్శించారు. గుణాగుణాలను గూర్చి చర్చలను కొనసాగించారు.
- డా. యు. ఎ. నరసింహమూర్తి