బుద్ధుని జీవిత కాలంలోనే, తెలుగు నేలపై బౌద్ధ ధమ్మం ప్రవేశించి, సమత, మమతలను ప్రసరింపజేసి తెలుగువారిని బుద్ధిజీవులుగా తీర్చి దిద్దింది. అశోకుని చొరవతో ఇటు ఆంద్రదేశంలోను, అటు తెలంగాణాలోనూ బుద్ధుని ధమ్మం మరింత వ్యాప్తిచెందింది. అందుకు ఉదాహరణగా అమరావతి, రాజులమందగిరి, ఎర్రగుడి శిలాశాసనాలను, అమరావతి, భట్టిప్రోలు, వడ్డమాను, బావికొండ దంతపురం, బౌద్ధ క్షేత్రాలను పేర్కొనవచ్చు. దాదాపు 275 సంవత్సరాలు తెలుగు నేలను నిరాటకంగా పాలించిన శాతవాహనాంద్రుల కాలంలో తీరాంధ్రలోనూ తెలంగాణా పీఠభూమిలోనూ, రాయలసీమ మాగాణం లోను 300లకు పైగా బౌద్ధరామాలు, దమ్మ వీచికలను ప్రసరింపజేసి, తెలుగు వారిని శాంతికాముకులుగా తీర్చిదిద్ది వారి జీవన విధానంలో హేతుబద్ధత, శీల నిబద్ధతలను అందించింది.
అనేక స్తూపాలు, చైత్యాలు, విహారాలో అలరారిన, ఆరామాలు, విద్యాలయాలుగా, వైద్యశాలలుగా తార్కిక ప్రజ్ఞానిలయాలుగా, కళాకేంద్రాలుగా విలసిల్లాయి. మనదేశపు తొలి శిల్పకళా సంప్రదాయాలైన గాంధార, మధుర, అమరావతి, శిల్పకళల్లో అపురూప శిల్పాలనందించిన అమరావతి శిల్పకళకు ప్రపంచ వ్యాప్త గుర్తింపు దక్కింది.
బుద్ధుని జీవిత కాలంలోనే, తెలుగు నేలపై బౌద్ధ ధమ్మం ప్రవేశించి, సమత, మమతలను ప్రసరింపజేసి తెలుగువారిని బుద్ధిజీవులుగా తీర్చి దిద్దింది. అశోకుని చొరవతో ఇటు ఆంద్రదేశంలోను, అటు తెలంగాణాలోనూ బుద్ధుని ధమ్మం మరింత వ్యాప్తిచెందింది. అందుకు ఉదాహరణగా అమరావతి, రాజులమందగిరి, ఎర్రగుడి శిలాశాసనాలను, అమరావతి, భట్టిప్రోలు, వడ్డమాను, బావికొండ దంతపురం, బౌద్ధ క్షేత్రాలను పేర్కొనవచ్చు. దాదాపు 275 సంవత్సరాలు తెలుగు నేలను నిరాటకంగా పాలించిన శాతవాహనాంద్రుల కాలంలో తీరాంధ్రలోనూ తెలంగాణా పీఠభూమిలోనూ, రాయలసీమ మాగాణం లోను 300లకు పైగా బౌద్ధరామాలు, దమ్మ వీచికలను ప్రసరింపజేసి, తెలుగు వారిని శాంతికాముకులుగా తీర్చిదిద్ది వారి జీవన విధానంలో హేతుబద్ధత, శీల నిబద్ధతలను అందించింది. అనేక స్తూపాలు, చైత్యాలు, విహారాలో అలరారిన, ఆరామాలు, విద్యాలయాలుగా, వైద్యశాలలుగా తార్కిక ప్రజ్ఞానిలయాలుగా, కళాకేంద్రాలుగా విలసిల్లాయి. మనదేశపు తొలి శిల్పకళా సంప్రదాయాలైన గాంధార, మధుర, అమరావతి, శిల్పకళల్లో అపురూప శిల్పాలనందించిన అమరావతి శిల్పకళకు ప్రపంచ వ్యాప్త గుర్తింపు దక్కింది.
© 2017,www.logili.com All Rights Reserved.