కులం, మతం, జెండర్ వంటి అంశాలకూ వర్గపోరాటానికి ఉండాల్సిన పరస్పర సంబంధాన్ని గురించీ, ప్రత్యేక సందర్భాల్లో ఆయా పోరాటాల ప్రాధాన్యతా క్రమాన్ని గురించీ నిరంతరంగా ఎన్నో ప్రశ్నలు తలెత్తుతూనే ఉన్నాయి. పీడత ప్రజల మధ్యనున్న వైరుధ్యాలను ప్రత్యేక పోరాటాలతో పరిష్కరించుకుంటూ ముందుకు సాగనిదే సంపూర్ణమైన సామాజిక మార్పు సాధ్యం కాదనీ, ఒకవేళ రాజకీయాధికారం చేతులు మారినా ఆ కొత్త మార్పును ఇముడ్చుకోగలిగే శక్తి సమాజానికి ఉండదనీ చెప్పటానికి బోలెడన్ని నిదర్శనాలు మనముందున్నాయి.
ఈ విషయాలన్నింటినీ సి వి చాలా వివరంగానే చెప్పారు. వ్యక్తుల చైతన్యాన్నీ, తద్వారా సామాజిక స్థాయినీ ఉన్నతీకరించే సంస్కృతికోధ్యమం వర్గపోరాటంలో అవిభాజ్యమైన అంశమని వివరించారు. ఈ విషయం పై మార్క్సిస్టు సిద్ధాంత వేత్తలు చేసిన విశ్లేషణాలన్నిటినీ ఏరి, కూర్చి పాఠకులకు అందించారు. ఈ పుస్తకంలో చాలా విలువైన అధ్యాయమది.
కులం, మతం, జెండర్ వంటి అంశాలకూ వర్గపోరాటానికి ఉండాల్సిన పరస్పర సంబంధాన్ని గురించీ, ప్రత్యేక సందర్భాల్లో ఆయా పోరాటాల ప్రాధాన్యతా క్రమాన్ని గురించీ నిరంతరంగా ఎన్నో ప్రశ్నలు తలెత్తుతూనే ఉన్నాయి. పీడత ప్రజల మధ్యనున్న వైరుధ్యాలను ప్రత్యేక పోరాటాలతో పరిష్కరించుకుంటూ ముందుకు సాగనిదే సంపూర్ణమైన సామాజిక మార్పు సాధ్యం కాదనీ, ఒకవేళ రాజకీయాధికారం చేతులు మారినా ఆ కొత్త మార్పును ఇముడ్చుకోగలిగే శక్తి సమాజానికి ఉండదనీ చెప్పటానికి బోలెడన్ని నిదర్శనాలు మనముందున్నాయి. ఈ విషయాలన్నింటినీ సి వి చాలా వివరంగానే చెప్పారు. వ్యక్తుల చైతన్యాన్నీ, తద్వారా సామాజిక స్థాయినీ ఉన్నతీకరించే సంస్కృతికోధ్యమం వర్గపోరాటంలో అవిభాజ్యమైన అంశమని వివరించారు. ఈ విషయం పై మార్క్సిస్టు సిద్ధాంత వేత్తలు చేసిన విశ్లేషణాలన్నిటినీ ఏరి, కూర్చి పాఠకులకు అందించారు. ఈ పుస్తకంలో చాలా విలువైన అధ్యాయమది.© 2017,www.logili.com All Rights Reserved.