చరిత్ర రచనలో ఆఖరివాక్యం సాధ్యం కాదు. పురాతన చరిత్రకు సంబంధించి ఇది మరింత వాస్తవం. నిజానికి ఆంధ్రదేశ చరిత్రకు సంబంధించి రాగిరేకులలోను, రాతి ఫలకాల మీద నిక్షిప్తమైపోయి ఒక పరిశోధకుని కోసం, ఒక పరిష్కర్త కోసం ఎదురు చూస్తున్న ఆధారాలు కోకొల్లలు. భారతదేశం లేదా ఆంధ్రదేశం 2700 సంవత్సరాల నాణేల చరిత్రను కలిగి ఉన్నాయి. కాని ఇందులో పరిశోధకులకు లభ్యమైన నాణేలు కొన్ని కొన్ని కాలాలకు చెందినవి మాత్రమే. నిధుల నుంచి లభ్యమైనవి కూడా చరిత్రకారుల చేతికి వచ్చినవి పరిమితమే. రెండో ప్రపంచయుద్ధంలో లోహాలకు కరువొచ్చింది. దీనితో రాగి, వెండి, సత్తు బంగారు నాణేలను గుట్టలు గుట్టలుగా కరగబెట్టి అవసరాలను తీర్చుకున్నారు. చరిత్ర పరిశోధనలో కూడా పూర్తిగా పరిశోధనకు నోచుకోలేదు. అందుబాటులో ఉన్న 6500 శాసనాలలో పరిష్కారమైనవి తక్కువే.
నాణేలు లభ్యం కావడం వేరు. వాటిని ఏళ్ళు పూళ్ళు పురావస్తు ప్రదర్శనశాలలో తాళం వేసి ఉంచకుండా పరిశోధించడం వేరు. ఈ పరిశోధన దగ్గరే మన రాష్ట్రం దురవస్థను తొలగించాలి. చరిత్ర అంటే పోటీ పరీక్షలలో భాగం మాత్రమే కాదు. ఒక జాతి సాంస్కృతిక సామాజిక రాజకీయ ప్రస్థానానికి సంబంధించిన రికార్డు. ఈ వాస్తవానికి ప్రభుత్వం, ప్రజలు కూడా గుర్తించాలి. దానిని గుర్తింప జేయడంలో ఈ పుస్తకం కొద్దిపాటి విజయం సాధించినా అది ఇప్పటి పరిస్థితులలో ఘనవిజయమే.
- దేమె రాజారెడ్డి
- గోపరాజు నారాయణరావు
చరిత్ర రచనలో ఆఖరివాక్యం సాధ్యం కాదు. పురాతన చరిత్రకు సంబంధించి ఇది మరింత వాస్తవం. నిజానికి ఆంధ్రదేశ చరిత్రకు సంబంధించి రాగిరేకులలోను, రాతి ఫలకాల మీద నిక్షిప్తమైపోయి ఒక పరిశోధకుని కోసం, ఒక పరిష్కర్త కోసం ఎదురు చూస్తున్న ఆధారాలు కోకొల్లలు. భారతదేశం లేదా ఆంధ్రదేశం 2700 సంవత్సరాల నాణేల చరిత్రను కలిగి ఉన్నాయి. కాని ఇందులో పరిశోధకులకు లభ్యమైన నాణేలు కొన్ని కొన్ని కాలాలకు చెందినవి మాత్రమే. నిధుల నుంచి లభ్యమైనవి కూడా చరిత్రకారుల చేతికి వచ్చినవి పరిమితమే. రెండో ప్రపంచయుద్ధంలో లోహాలకు కరువొచ్చింది. దీనితో రాగి, వెండి, సత్తు బంగారు నాణేలను గుట్టలు గుట్టలుగా కరగబెట్టి అవసరాలను తీర్చుకున్నారు. చరిత్ర పరిశోధనలో కూడా పూర్తిగా పరిశోధనకు నోచుకోలేదు. అందుబాటులో ఉన్న 6500 శాసనాలలో పరిష్కారమైనవి తక్కువే. నాణేలు లభ్యం కావడం వేరు. వాటిని ఏళ్ళు పూళ్ళు పురావస్తు ప్రదర్శనశాలలో తాళం వేసి ఉంచకుండా పరిశోధించడం వేరు. ఈ పరిశోధన దగ్గరే మన రాష్ట్రం దురవస్థను తొలగించాలి. చరిత్ర అంటే పోటీ పరీక్షలలో భాగం మాత్రమే కాదు. ఒక జాతి సాంస్కృతిక సామాజిక రాజకీయ ప్రస్థానానికి సంబంధించిన రికార్డు. ఈ వాస్తవానికి ప్రభుత్వం, ప్రజలు కూడా గుర్తించాలి. దానిని గుర్తింప జేయడంలో ఈ పుస్తకం కొద్దిపాటి విజయం సాధించినా అది ఇప్పటి పరిస్థితులలో ఘనవిజయమే. - దేమె రాజారెడ్డి - గోపరాజు నారాయణరావు© 2017,www.logili.com All Rights Reserved.