ఆఫ్ హ్యూమన్ బాండేజ్ ఆత్మకథ కాదు, కానీ ఆత్మకథాత్మక నవల. ఇందులో వాస్తవం, కల్పన విడదీయరాని విధంగా కలసిపోయి ఉన్నాయి. ఆవేశోద్వేగాలు నావి, కానీ చెప్పిన సంఘటనలన్నీ అవి జరిగినట్టుగా లేవు. వాటిల్లో కొన్నింటిని నా నాయకుడికి నా జీవితం నుండి కాక, నాకు సన్నిహితమైన వ్యక్తుల జీవితాల నుండి బదలాయింపు చేయటం జరిగింది. నేనేం కోరుకున్నానో దాన్ని నాకు ఈ పుస్తకం సాధించిపెట్టింది. దీన్ని ప్రపంచానికి విడుదల చేసినప్పుడు, నన్ను బాధించిన బాధలు, అసుఖదమయిన జ్ఞాపకాలనుండి నేను విముక్తమయ్యాను. దీన్ని గురించి మంచి సమీక్ష లోచ్చాయి. ది న్యూ రిపబ్లిక్ పత్రికలో థియోడర్ డ్రైజర్ సుదీర్ఘమయిన విమర్శ చేశాడు.
తాను రాసిన రాతలన్నింటిలో వ్యక్తమయ్యే మేధా, సహానుభూతి ఇందులోనూ ద్రుశించాయి. కానీ ఎన్నో నవలలు వెళ్ళిన తోవనే ఇదికూడా పయనిస్తుందనీ, అవతరించిన కొద్ది నెలల తర్వాత దాన్ని మర్చిపోవటం జరుగుతుందనీ భావించాను. అయితే, ఎలాంటి యాదృచ్చికత వల్ల, అది సంభవించిందో లేదో నాకు తెలియదు కానీ, కొన్నేళ్ళ తర్వాత అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని చాలామంది ప్రముఖ రచయితల దృష్టినిడి ఆకర్షించింది. వారు దీనిని గురించి తరచు పత్రికలలో ప్రసక్తంచేయటం వల్ల అది క్రమంగా జనసామాన్య దృష్టికి వచ్చింది. అలా ఈ పుస్తకానికి ఆ రచయితలు కొత్త జీవిత కాలావధిని ప్రసాదించారు. అలా సంవత్సరాలు గడుస్తున్నా, ఈ పుస్తకం పాఠకుల అభిమానాన్ని చూరగొంటున్నదంటే అందుకు కారణమయిన ఆ రచయితలకు నా కృతఙ్ఞతలు.
- విలియం సోమర్సెట్ మామ్
ఆఫ్ హ్యూమన్ బాండేజ్ ఆత్మకథ కాదు, కానీ ఆత్మకథాత్మక నవల. ఇందులో వాస్తవం, కల్పన విడదీయరాని విధంగా కలసిపోయి ఉన్నాయి. ఆవేశోద్వేగాలు నావి, కానీ చెప్పిన సంఘటనలన్నీ అవి జరిగినట్టుగా లేవు. వాటిల్లో కొన్నింటిని నా నాయకుడికి నా జీవితం నుండి కాక, నాకు సన్నిహితమైన వ్యక్తుల జీవితాల నుండి బదలాయింపు చేయటం జరిగింది. నేనేం కోరుకున్నానో దాన్ని నాకు ఈ పుస్తకం సాధించిపెట్టింది. దీన్ని ప్రపంచానికి విడుదల చేసినప్పుడు, నన్ను బాధించిన బాధలు, అసుఖదమయిన జ్ఞాపకాలనుండి నేను విముక్తమయ్యాను. దీన్ని గురించి మంచి సమీక్ష లోచ్చాయి. ది న్యూ రిపబ్లిక్ పత్రికలో థియోడర్ డ్రైజర్ సుదీర్ఘమయిన విమర్శ చేశాడు. తాను రాసిన రాతలన్నింటిలో వ్యక్తమయ్యే మేధా, సహానుభూతి ఇందులోనూ ద్రుశించాయి. కానీ ఎన్నో నవలలు వెళ్ళిన తోవనే ఇదికూడా పయనిస్తుందనీ, అవతరించిన కొద్ది నెలల తర్వాత దాన్ని మర్చిపోవటం జరుగుతుందనీ భావించాను. అయితే, ఎలాంటి యాదృచ్చికత వల్ల, అది సంభవించిందో లేదో నాకు తెలియదు కానీ, కొన్నేళ్ళ తర్వాత అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని చాలామంది ప్రముఖ రచయితల దృష్టినిడి ఆకర్షించింది. వారు దీనిని గురించి తరచు పత్రికలలో ప్రసక్తంచేయటం వల్ల అది క్రమంగా జనసామాన్య దృష్టికి వచ్చింది. అలా ఈ పుస్తకానికి ఆ రచయితలు కొత్త జీవిత కాలావధిని ప్రసాదించారు. అలా సంవత్సరాలు గడుస్తున్నా, ఈ పుస్తకం పాఠకుల అభిమానాన్ని చూరగొంటున్నదంటే అందుకు కారణమయిన ఆ రచయితలకు నా కృతఙ్ఞతలు. - విలియం సోమర్సెట్ మామ్© 2017,www.logili.com All Rights Reserved.