భారతదేశ చరిత్రలో ఇదొక స్వర్ణయుగము. స్వయంభూ తేజోవిరాజిత ఏకశిలా మహానగరము రాజధానిగా వెలుగొందిన 'రుద్ర' తేజము. ఒకవైపు మైలారుభటుల ప్రేరణ శివతాండవము మరొకవైపు మాచలదేవీ మధుర లాస్యము ఇదొక భూకైలసము. కాకతీయులనాటి సాహిత్య సంగీత నాట్య శిల్ప చిత్రలేఖనములపై అపూర్వ కఠోర పరిశ్రమతో చారిత్రిక నవలాచక్రవర్తి ముదిగొండ శివప్రసాద్ రచించిన పరమ ప్రామాణిక సిద్ధాంత గ్రంథము. మూడు శతాబ్దముల కాకతీయ చరిత్ర ఇందులో ఉంది.
వందల శిలాశాసనములు అసంఖ్యాక గ్రంథ క్షీర సాగరాన్ని మథించి అందించిన అమృతమిది. కాకతీయుల పుట్టుక - ప్రభావము - సమగ్ర చరిత్ర వివిధ కాకతీయ దేవాలయముల శిల్పవైభవము సచిత్రంగా అందిస్తున్న గ్రంథము. వందలాది శిలాశాసనములు, నృత్యరత్నావళి, క్రీడాభిరామము, పండితారాధ్య చరిత్ర, ప్రతాపరుద్ర యశోభూషణం వంటి అసంఖ్యాక గ్రంథములను పరిశోధించి అందించిన ప్రామాణిక రచన. తెలుగువారు మాత్రమే కాదు భారతీయులంతా పాఠ్యగ్రంథంగా చదువవలసిన మహోత్తమ పరిశోధన.
భారతదేశ చరిత్రలో ఇదొక స్వర్ణయుగము. స్వయంభూ తేజోవిరాజిత ఏకశిలా మహానగరము రాజధానిగా వెలుగొందిన 'రుద్ర' తేజము. ఒకవైపు మైలారుభటుల ప్రేరణ శివతాండవము మరొకవైపు మాచలదేవీ మధుర లాస్యము ఇదొక భూకైలసము. కాకతీయులనాటి సాహిత్య సంగీత నాట్య శిల్ప చిత్రలేఖనములపై అపూర్వ కఠోర పరిశ్రమతో చారిత్రిక నవలాచక్రవర్తి ముదిగొండ శివప్రసాద్ రచించిన పరమ ప్రామాణిక సిద్ధాంత గ్రంథము. మూడు శతాబ్దముల కాకతీయ చరిత్ర ఇందులో ఉంది. వందల శిలాశాసనములు అసంఖ్యాక గ్రంథ క్షీర సాగరాన్ని మథించి అందించిన అమృతమిది. కాకతీయుల పుట్టుక - ప్రభావము - సమగ్ర చరిత్ర వివిధ కాకతీయ దేవాలయముల శిల్పవైభవము సచిత్రంగా అందిస్తున్న గ్రంథము. వందలాది శిలాశాసనములు, నృత్యరత్నావళి, క్రీడాభిరామము, పండితారాధ్య చరిత్ర, ప్రతాపరుద్ర యశోభూషణం వంటి అసంఖ్యాక గ్రంథములను పరిశోధించి అందించిన ప్రామాణిక రచన. తెలుగువారు మాత్రమే కాదు భారతీయులంతా పాఠ్యగ్రంథంగా చదువవలసిన మహోత్తమ పరిశోధన.
© 2017,www.logili.com All Rights Reserved.