గాలిలో చెలరేగి ఆడుతున్నాయి తూనీగలు, భూమి మీది పిల్లలవలెనే! వెలిమబ్బులలో ఆకాశం దోబూచులాడుకుంటున్నది. ఉదయం ఫెళ్లున ఎండవచ్చినా అందులో వేడిలేదు. ఆ సమయంలో అమలాపురంలోని సర్కార్ కచ్చేరీముందు ఒక గుర్రపు బగ్గీ ఆగింది.
అందులోనుండి ఒక శ్వేతజాతీయుడు దిగాడు. ఆరడుగుల విగ్రహం ! సన్నగా, తెల్లగా ఎత్తైన సాలవృక్షంలాగావున్నాడు. గుర్రాలు నిలబడి సకిలించి ముందు కాళ్ళ గిట్టలతో నేలను కొట్టాయి.
'హెయ్ -హెహ్హయ్' బండివాడు పగ్గాలను పట్టు కొని లాగి వాటిని బండికి ముడివేశాడు.
ఈ ధ్వని విని కచ్చేరీలోపలినుండి సోమసూర్యుడు పరుగెత్తుకుంటూ వచ్చాడు. "గుడ్డుమార్నింగు సారూ-గుడ్డు మార్నింగు" అంటూ సోమసూర్యుడు తెల్లవానికి ఎదురు వెళ్ళాడు.
‘గుడ్ మానింగ్ -’ అనిపలుకరించాడు చిరునవ్వుతో తెల్లవ్యక్తి.
"మై నేమ్ ఈజు సోమసూర్యుడు సారూ" అని తనను తాను పరిచయం చేసుకుంటూ సోమసూర్యుడు తెల్లవాని చేతిలోని పెట్టె అందుకున్నాడు.
"అయామ్ మిస్టర్ అండర్సన్ - స్పెషల్ ఆఫీసర్” అని తనను తాను పరిచయం చేసుకున్నాడు అండర్సన్.
"తెలుసు సారూ - తమరు కాకినాడనుండి వస్తున్నారని. ఈరోజు చాలా శుభోదయం” అని ఇంగ్లీషులో అన్నాడు సోమసూర్యుడు...................
ఆ షా ఢ గౌత మి ఆషాఢమాసం !! గాలిలో చెలరేగి ఆడుతున్నాయి తూనీగలు, భూమి మీది పిల్లలవలెనే! వెలిమబ్బులలో ఆకాశం దోబూచులాడుకుంటున్నది. ఉదయం ఫెళ్లున ఎండవచ్చినా అందులో వేడిలేదు. ఆ సమయంలో అమలాపురంలోని సర్కార్ కచ్చేరీముందు ఒక గుర్రపు బగ్గీ ఆగింది. అందులోనుండి ఒక శ్వేతజాతీయుడు దిగాడు. ఆరడుగుల విగ్రహం ! సన్నగా, తెల్లగా ఎత్తైన సాలవృక్షంలాగావున్నాడు. గుర్రాలు నిలబడి సకిలించి ముందు కాళ్ళ గిట్టలతో నేలను కొట్టాయి. 'హెయ్ -హెహ్హయ్' బండివాడు పగ్గాలను పట్టు కొని లాగి వాటిని బండికి ముడివేశాడు. ఈ ధ్వని విని కచ్చేరీలోపలినుండి సోమసూర్యుడు పరుగెత్తుకుంటూ వచ్చాడు. "గుడ్డుమార్నింగు సారూ-గుడ్డు మార్నింగు" అంటూ సోమసూర్యుడు తెల్లవానికి ఎదురు వెళ్ళాడు. ‘గుడ్ మానింగ్ -’ అనిపలుకరించాడు చిరునవ్వుతో తెల్లవ్యక్తి. "మై నేమ్ ఈజు సోమసూర్యుడు సారూ" అని తనను తాను పరిచయం చేసుకుంటూ సోమసూర్యుడు తెల్లవాని చేతిలోని పెట్టె అందుకున్నాడు. "అయామ్ మిస్టర్ అండర్సన్ - స్పెషల్ ఆఫీసర్” అని తనను తాను పరిచయం చేసుకున్నాడు అండర్సన్. "తెలుసు సారూ - తమరు కాకినాడనుండి వస్తున్నారని. ఈరోజు చాలా శుభోదయం” అని ఇంగ్లీషులో అన్నాడు సోమసూర్యుడు...................© 2017,www.logili.com All Rights Reserved.