పక్షులను చూడటాన్ని మనం ఉన్నచోటు నుండే మొదలుపెట్టవచ్చు. ఇందుకు ఎంతో ఓర్పు అవసరం. పక్షులు ఊరకనే బెదురుకుంటాయి. అయినా నిరుత్సాహ పడకూడదు. ముందు సాధారణంగా కనపడే పక్షులను చూడండి. తరువాత అరుదుగా కనిపించే పక్షులను కూడా చూడగలుగుతారు. ఏ సమయంలోనైనా పక్షులను చూడవచ్చు. అయితే సూర్యోదయం, సూర్యాస్తమయాల సమయంలో పక్షులు చాలా చురుకుగా ఉంటాయి.
మర్రి, రావి చెట్లు పండ్లతో ఉన్నప్పుడు; బూరుగదూది, మోదుగ వంటి చెట్లు పూలతో ఉన్నప్పుడు అనేక రకాల పక్షులు వాటి మీదకు చేరతాయి. బూరుగ, మోదుగ వంటివి పూలతో ఉన్నప్పుడు ఆకులు ఉండవు కాబట్టి పక్షులు బాగా కనపడతాయి. పక్షులను పరిచయం చేయటానికీ, వాటి పట్ల ఆసక్తి కలిగించటానికీ ఈ పుస్తకం ఉపయోగపడుతుంది. రండి పక్షుల లోకానికి పేజీలు తీసి విహరిద్దాం.
పక్షులను చూడటాన్ని మనం ఉన్నచోటు నుండే మొదలుపెట్టవచ్చు. ఇందుకు ఎంతో ఓర్పు అవసరం. పక్షులు ఊరకనే బెదురుకుంటాయి. అయినా నిరుత్సాహ పడకూడదు. ముందు సాధారణంగా కనపడే పక్షులను చూడండి. తరువాత అరుదుగా కనిపించే పక్షులను కూడా చూడగలుగుతారు. ఏ సమయంలోనైనా పక్షులను చూడవచ్చు. అయితే సూర్యోదయం, సూర్యాస్తమయాల సమయంలో పక్షులు చాలా చురుకుగా ఉంటాయి. మర్రి, రావి చెట్లు పండ్లతో ఉన్నప్పుడు; బూరుగదూది, మోదుగ వంటి చెట్లు పూలతో ఉన్నప్పుడు అనేక రకాల పక్షులు వాటి మీదకు చేరతాయి. బూరుగ, మోదుగ వంటివి పూలతో ఉన్నప్పుడు ఆకులు ఉండవు కాబట్టి పక్షులు బాగా కనపడతాయి. పక్షులను పరిచయం చేయటానికీ, వాటి పట్ల ఆసక్తి కలిగించటానికీ ఈ పుస్తకం ఉపయోగపడుతుంది. రండి పక్షుల లోకానికి పేజీలు తీసి విహరిద్దాం.© 2017,www.logili.com All Rights Reserved.