“మీ ఆవిడ... మీ అమ్మ పోట్లాడుకుంటున్నారనుకో! నువ్వు ఏ పక్కనుంటావ్?' అని ప్రశ్నిస్తే “గోడ పక్కనుంటాను,” అంటూ కీమంటూ సమాధానం చెబుతాడు బుచ్చిబాబు. యథాప్రకారం ఆ రోజు కూడా తల్లి తాయారమ్మ, భార్య అఖిలాండేశ్వరి ఉదయాన్నే ఇంట్లో యుద్ధ వాతావరణాన్ని సృష్టించారు. తిట్లు, శాపనార్ధాలు, కొండ బూతులు, బండ బూతులు యథేచ్ఛగా సాగిపోయాయి. గంటన్నర దాకా సాగిన వార్ ఆ తర్వాత కొద్దిగా తగ్గు ముఖం పట్టింది. అప్పటిదాకా గోడ పక్కనే దాక్కున్న బుచ్చిబాబు ఇంట్లోకి వచ్చాడు.
భర్తను చూడగానే బంకర్ లో దాక్కుని బైటకు వచ్చిన శత్రువును చూసినట్లు చూస్తూ విరుచుకుపడింది అఖిలాండేశ్వరి. “ఈ రోజు మన పెళ్ళి రోజు అఖిలం" దీనంగా చెప్పాడు బుచ్చిబాబు. “అయితే రెండెక్కువ పడాల్సిందే”! అంటూ బుచ్చిబాబు వీపు మీద 'పెడ... పెడా' మంటూ నాలుగు బాదింది. బుచ్చిబాబు ఏడుపు ముఖం పెట్టి “జీవితంలో పెళ్ళి రోజుని మరుపురాని రోజని ఎందుకంటారో..........
“మీ ఆవిడ... మీ అమ్మ పోట్లాడుకుంటున్నారనుకో! నువ్వు ఏ పక్కనుంటావ్?' అని ప్రశ్నిస్తే “గోడ పక్కనుంటాను,” అంటూ కీమంటూ సమాధానం చెబుతాడు బుచ్చిబాబు. యథాప్రకారం ఆ రోజు కూడా తల్లి తాయారమ్మ, భార్య అఖిలాండేశ్వరి ఉదయాన్నే ఇంట్లో యుద్ధ వాతావరణాన్ని సృష్టించారు. తిట్లు, శాపనార్ధాలు, కొండ బూతులు, బండ బూతులు యథేచ్ఛగా సాగిపోయాయి. గంటన్నర దాకా సాగిన వార్ ఆ తర్వాత కొద్దిగా తగ్గు ముఖం పట్టింది. అప్పటిదాకా గోడ పక్కనే దాక్కున్న బుచ్చిబాబు ఇంట్లోకి వచ్చాడు. భర్తను చూడగానే బంకర్ లో దాక్కుని బైటకు వచ్చిన శత్రువును చూసినట్లు చూస్తూ విరుచుకుపడింది అఖిలాండేశ్వరి. “ఈ రోజు మన పెళ్ళి రోజు అఖిలం" దీనంగా చెప్పాడు బుచ్చిబాబు. “అయితే రెండెక్కువ పడాల్సిందే”! అంటూ బుచ్చిబాబు వీపు మీద 'పెడ... పెడా' మంటూ నాలుగు బాదింది. బుచ్చిబాబు ఏడుపు ముఖం పెట్టి “జీవితంలో పెళ్ళి రోజుని మరుపురాని రోజని ఎందుకంటారో..........© 2017,www.logili.com All Rights Reserved.