కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి ఆశయాలను, ఆయన తన ప్రాపంచిక దృక్పథంగా స్వీకరించి ఆచరించిన మార్క్సిజం - లెనినిజం - మావో ఆలోచనా విధానాన్ని ప్రచారం చేయాలన్న లక్ష్యంతో 1978 జూలైలో "తరిమెల నాగిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్" ఏర్పడింది. మార్క్సిజం - లెనినిజం - మావో ఆలోచనా విధానాన్ని సాహిత్య, సాంస్కృతిక, విద్యాసంబంధమైన కార్యకలాపాల ద్వారా తన లక్ష్యానికి అనుగుణంగా శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నది.
1978 జూలై లో నాగిరెడ్డి కోర్టు ప్రకటనను "ఇండియా మార్ట్ గేజ్ద్" పేరుతో ఇంగ్లీషులో ప్రచురించాము. 1980 లో దీనినే "తాకట్టులో భారతదేశం" అన్న పేరుతో తెలుగు అనువాదాన్ని ప్రచురించాము. 1984 లో తెలుగు అనువాద౦ రెండవ ముద్రణను తెచ్చాము. 1993 లో ఇంగ్లీషులో రెండవ ముద్రణనూ, తెలుగులో మూడవ ముద్రణనూ ప్రచురించాము. 2003 లో ఇంగ్లీషు మూడవ ముద్రణ వచ్చింది. 2011 లో హిందీ అనువాదం, 2015 లో తమిళ అనువాదం, కన్నడ బాషలో కొన్ని భాగాల్ని వెలుగులోకి తెచ్చాము. 2013 లో తెలుగు నాల్గవ ముద్రణ వెలుగు చూసింది. ఇది కాక అనేక చిన్న పుస్తకాలను ఇంగ్లీషులోనూ, తెలుగులోనూ ప్రచురించాము.
కామ్రేడ్ నాగిరెడ్డి తన సహజమైన శైలిలో ప్రతిభావంతమైన విశ్లేషణతో అత్యంత శక్తివంతంగా చేసిన ఈ రచనకు సంపాదక బాధ్యతను నిర్వహించడం క్లిష్టమైన కర్తవ్యం. కనుకనే మూలపాఠంలో ఎలాంటి మార్పులూ చేయకుండా తర్వాతి కాలపు గణాంకాలను వివిధ అధ్యాయాలకు అనుబంధాలుగా చేర్చాము. ఇంకా చేర్చవలసినవి ఉన్నాయి. ఈ గ్రంథం నాలుగవ ముద్రణ కాపీలు కూడా కొద్ది కాలంలోనే అయిపోయాయి. కా.టి.ఎన్ శత జయతిని జరుపుకుంటున్న ఈ సందర్భంగా ఐదవ ముద్రణకు సిద్ధం చేశాము.
- తరిమెల నాగిరెడ్డి
కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి ఆశయాలను, ఆయన తన ప్రాపంచిక దృక్పథంగా స్వీకరించి ఆచరించిన మార్క్సిజం - లెనినిజం - మావో ఆలోచనా విధానాన్ని ప్రచారం చేయాలన్న లక్ష్యంతో 1978 జూలైలో "తరిమెల నాగిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్" ఏర్పడింది. మార్క్సిజం - లెనినిజం - మావో ఆలోచనా విధానాన్ని సాహిత్య, సాంస్కృతిక, విద్యాసంబంధమైన కార్యకలాపాల ద్వారా తన లక్ష్యానికి అనుగుణంగా శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నది. 1978 జూలై లో నాగిరెడ్డి కోర్టు ప్రకటనను "ఇండియా మార్ట్ గేజ్ద్" పేరుతో ఇంగ్లీషులో ప్రచురించాము. 1980 లో దీనినే "తాకట్టులో భారతదేశం" అన్న పేరుతో తెలుగు అనువాదాన్ని ప్రచురించాము. 1984 లో తెలుగు అనువాద౦ రెండవ ముద్రణను తెచ్చాము. 1993 లో ఇంగ్లీషులో రెండవ ముద్రణనూ, తెలుగులో మూడవ ముద్రణనూ ప్రచురించాము. 2003 లో ఇంగ్లీషు మూడవ ముద్రణ వచ్చింది. 2011 లో హిందీ అనువాదం, 2015 లో తమిళ అనువాదం, కన్నడ బాషలో కొన్ని భాగాల్ని వెలుగులోకి తెచ్చాము. 2013 లో తెలుగు నాల్గవ ముద్రణ వెలుగు చూసింది. ఇది కాక అనేక చిన్న పుస్తకాలను ఇంగ్లీషులోనూ, తెలుగులోనూ ప్రచురించాము. కామ్రేడ్ నాగిరెడ్డి తన సహజమైన శైలిలో ప్రతిభావంతమైన విశ్లేషణతో అత్యంత శక్తివంతంగా చేసిన ఈ రచనకు సంపాదక బాధ్యతను నిర్వహించడం క్లిష్టమైన కర్తవ్యం. కనుకనే మూలపాఠంలో ఎలాంటి మార్పులూ చేయకుండా తర్వాతి కాలపు గణాంకాలను వివిధ అధ్యాయాలకు అనుబంధాలుగా చేర్చాము. ఇంకా చేర్చవలసినవి ఉన్నాయి. ఈ గ్రంథం నాలుగవ ముద్రణ కాపీలు కూడా కొద్ది కాలంలోనే అయిపోయాయి. కా.టి.ఎన్ శత జయతిని జరుపుకుంటున్న ఈ సందర్భంగా ఐదవ ముద్రణకు సిద్ధం చేశాము. - తరిమెల నాగిరెడ్డిIndian
© 2017,www.logili.com All Rights Reserved.