కొత్త స్వరాల అన్వేషణలో
(an appeal)
ఇదంతా వొక ఆందోళన జీవి గోల. వద్దనుకునే పాఠకులు యీ పేజీలు తప్పించి నేరుగా లోపలి కథల్లోకి వెళ్లిపోవచ్చు.
܀ ܀ ܀
చుట్టూ చీకటి. దారి అగమ్యం. చేతిలో దిక్సూచి లేదు. ఎక్కడ యెలా మొదలు కావాలో తెలీదు. అంతా యెగుడు దిగుళ్ళు. నడక ప్రతి అడుగులోనూ సంశయం. వెతుకులాట దేనికోసమో యేర్పడదు. కాళ్ళకి చుట్టుకునే తీగపై ఆశ. అది పామేమోనని భయం. కొన్నిటిని గుర్తించి నిర్వచించుకోవడం దగ్గరే మొదటి గండం యెదురవుతుంది. కొన్ని లేవని బెంగ. దూరంగా వొక వొంటరి చుక్క మెరుస్తుంది. అది వేకువ రాకడని తెలుపుతుంది. చూపు తేటబడుతుంది. దారి గోచరిస్తుంది.
అకస్మాత్తుగా ఆగిన కథో జీవితమో వొక ఆసరాతో మళ్ళీ మొదలౌతుంది. ఇదొక నిరంతర
ప్రయాణం.
܀
కొత్త తరం పాత తరం భుజాల మీద కూర్చుని చూస్తుంది కనకనే యెక్కువ దూరం చూడగలుగుతుంది - ఇవే మాటలు కాదు గానీ తన జీవితానుభవం నుంచి యిటువంటి అర్థం వచ్చే మాటలే అంటాడు ఐజాక్ న్యూటన్. మన యెదుగుదలకూ పురో గమనానికీ మనకంటే పెద్దవాళ్ళు అంతకుముందే నిర్మించిన దారి వొకటి వుంది కాబట్టి ఆ దారిలో నడవడం తేలిక అని ఆయన వుద్దేశ్యం. అయితే పాత దారుల్లో నడవడమో వాటిని పొడిగించుకోవడమో మాత్రమే చేస్తే కొత్త దారులు యెప్పుడు యెలా పరుచుకుంటాయి అన్నది పెద్ద ప్రశ్న. శాస్త్ర సాంకేతిక రంగాల్లో న్యూటన్ మాటల్ని కొంతవరకు అంగీకరించవచ్చేమో గానీ సృజనాత్మకతకి నెలవైన..................
కొత్త స్వరాల అన్వేషణలో (an appeal) ఇదంతా వొక ఆందోళన జీవి గోల. వద్దనుకునే పాఠకులు యీ పేజీలు తప్పించి నేరుగా లోపలి కథల్లోకి వెళ్లిపోవచ్చు. ܀ ܀ ܀ చుట్టూ చీకటి. దారి అగమ్యం. చేతిలో దిక్సూచి లేదు. ఎక్కడ యెలా మొదలు కావాలో తెలీదు. అంతా యెగుడు దిగుళ్ళు. నడక ప్రతి అడుగులోనూ సంశయం. వెతుకులాట దేనికోసమో యేర్పడదు. కాళ్ళకి చుట్టుకునే తీగపై ఆశ. అది పామేమోనని భయం. కొన్నిటిని గుర్తించి నిర్వచించుకోవడం దగ్గరే మొదటి గండం యెదురవుతుంది. కొన్ని లేవని బెంగ. దూరంగా వొక వొంటరి చుక్క మెరుస్తుంది. అది వేకువ రాకడని తెలుపుతుంది. చూపు తేటబడుతుంది. దారి గోచరిస్తుంది. అకస్మాత్తుగా ఆగిన కథో జీవితమో వొక ఆసరాతో మళ్ళీ మొదలౌతుంది. ఇదొక నిరంతర ప్రయాణం. ܀ కొత్త తరం పాత తరం భుజాల మీద కూర్చుని చూస్తుంది కనకనే యెక్కువ దూరం చూడగలుగుతుంది - ఇవే మాటలు కాదు గానీ తన జీవితానుభవం నుంచి యిటువంటి అర్థం వచ్చే మాటలే అంటాడు ఐజాక్ న్యూటన్. మన యెదుగుదలకూ పురో గమనానికీ మనకంటే పెద్దవాళ్ళు అంతకుముందే నిర్మించిన దారి వొకటి వుంది కాబట్టి ఆ దారిలో నడవడం తేలిక అని ఆయన వుద్దేశ్యం. అయితే పాత దారుల్లో నడవడమో వాటిని పొడిగించుకోవడమో మాత్రమే చేస్తే కొత్త దారులు యెప్పుడు యెలా పరుచుకుంటాయి అన్నది పెద్ద ప్రశ్న. శాస్త్ర సాంకేతిక రంగాల్లో న్యూటన్ మాటల్ని కొంతవరకు అంగీకరించవచ్చేమో గానీ సృజనాత్మకతకి నెలవైన..................© 2017,www.logili.com All Rights Reserved.