ఒక గంభీరమైన సామాజిక, రాజకీయ, సాంస్కృతిక చింతన కలిగి ఉండి, తనచుట్టూ ఉన్న సమాజ, సమూహాలను నిశితంగా పరిశీలన చేసి, తన పరిశీలనలో నిగ్గుతేలిన కటువైన జీవన వాస్తవాలను, వివిధ కోణాల నుంచి దర్శించి పరిపక్వంగా, సంపూర్ణంగా ఆవిష్కరిస్తున్నాడు షరీఫ్. ఇతని కథలు చదవటం వల్ల మనకు తెలియని మరో సమూహపు జీవితమంతా తేటతెల్లమవుతుంది. అతి ప్రత్యేకత జోలికి పోకుండా వివిధ వాద, సిద్ధాంత, భావజాల ప్రభావాలకు అతిగా లోనుకాకుండా జీవితం ముందు విధేయంగా నిలబడ్డాడు షరీఫ్. ఆ జీవిటం అందిస్త్తున్న పలు పార్శ్వాలను కథలుగా మలుస్తున్నాడు. కథను పౌరవిద్యకు ఒక సాధనంగా మలిచి చూపుతున్నాడు.
ఒక గంభీరమైన సామాజిక, రాజకీయ, సాంస్కృతిక చింతన కలిగి ఉండి, తనచుట్టూ ఉన్న సమాజ, సమూహాలను నిశితంగా పరిశీలన చేసి, తన పరిశీలనలో నిగ్గుతేలిన కటువైన జీవన వాస్తవాలను, వివిధ కోణాల నుంచి దర్శించి పరిపక్వంగా, సంపూర్ణంగా ఆవిష్కరిస్తున్నాడు షరీఫ్. ఇతని కథలు చదవటం వల్ల మనకు తెలియని మరో సమూహపు జీవితమంతా తేటతెల్లమవుతుంది. అతి ప్రత్యేకత జోలికి పోకుండా వివిధ వాద, సిద్ధాంత, భావజాల ప్రభావాలకు అతిగా లోనుకాకుండా జీవితం ముందు విధేయంగా నిలబడ్డాడు షరీఫ్. ఆ జీవిటం అందిస్త్తున్న పలు పార్శ్వాలను కథలుగా మలుస్తున్నాడు. కథను పౌరవిద్యకు ఒక సాధనంగా మలిచి చూపుతున్నాడు.© 2017,www.logili.com All Rights Reserved.