ఎందరికో యోగవిద్య అభ్యసించాలనే కోరిక, తపన, ఆకాంక్ష ఉండవచ్చు కాని అది అందరికీ సాధ్యంకాదు. ఎందుకంటే యోగవిద్య అభ్యసించాలంటే పూర్వజన్మసుకృతం ఉండాలి. అది లేకుంటే ఎంత తపన ఉన్న చేరువకలేరు. చేరువైనా అందులో పరిపూర్ణత సాధించలేరు. ఈ శిక్షణలో పరిపూర్ణత చెందాలనే తపనను, కోరికను మీరు దేవుని ప్రేరణగా భావించి, దృఢ సంకల్పంతో, యోగావిధ్యను పరిపూర్ణంగా అభ్యసించాలని బుద్ధిలోను, మనస్సులోను ఉంచుకొని, చక్కగా విద్యను నేర్చుకొని నిత్య జీవితంలో ఆచరణలో పెట్టండి. మీ జీవితం ఆరోగ్యంగా, ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగుతుంది. మీ జీవాత్మ పరమాత్మకు చేరువై మీరు ముక్తిప్రదాతలు అవుతారు.
యోగ అంటే ఆసనం అని కొందరు, ప్రాణాయామమని మరికొందరు, ధ్యానం అని ఇంకొందరు భావిస్తూ, కొందరు ఆసనాలు, మరికొందరు ప్రాణాయామము ఇంకొందరు ధ్యానం చేస్తున్నారు. దీనికి కారణం అసంపూర్ణమైన విద్యను నేర్పే గురువులు అధికమవ్వడమే.
బి. వేణుగోపాల్
ఎందరికో యోగవిద్య అభ్యసించాలనే కోరిక, తపన, ఆకాంక్ష ఉండవచ్చు కాని అది అందరికీ సాధ్యంకాదు. ఎందుకంటే యోగవిద్య అభ్యసించాలంటే పూర్వజన్మసుకృతం ఉండాలి. అది లేకుంటే ఎంత తపన ఉన్న చేరువకలేరు. చేరువైనా అందులో పరిపూర్ణత సాధించలేరు. ఈ శిక్షణలో పరిపూర్ణత చెందాలనే తపనను, కోరికను మీరు దేవుని ప్రేరణగా భావించి, దృఢ సంకల్పంతో, యోగావిధ్యను పరిపూర్ణంగా అభ్యసించాలని బుద్ధిలోను, మనస్సులోను ఉంచుకొని, చక్కగా విద్యను నేర్చుకొని నిత్య జీవితంలో ఆచరణలో పెట్టండి. మీ జీవితం ఆరోగ్యంగా, ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగుతుంది. మీ జీవాత్మ పరమాత్మకు చేరువై మీరు ముక్తిప్రదాతలు అవుతారు. యోగ అంటే ఆసనం అని కొందరు, ప్రాణాయామమని మరికొందరు, ధ్యానం అని ఇంకొందరు భావిస్తూ, కొందరు ఆసనాలు, మరికొందరు ప్రాణాయామము ఇంకొందరు ధ్యానం చేస్తున్నారు. దీనికి కారణం అసంపూర్ణమైన విద్యను నేర్పే గురువులు అధికమవ్వడమే. బి. వేణుగోపాల్© 2017,www.logili.com All Rights Reserved.