లౌకిక వాదం మీద, అసహనం మీద దేశంలో ఈ రోజు జరుగుతున్న చర్చల తీరుతెన్నులు చూస్తుంటే నిజంగానే సామాన్యుడికి చిరాకు కలుగుతున్నది. చాలా ఏళ్ళ క్రిందట హైదరాబాద్ నగరం మత కల్లోలాలతో అట్టుడిగిపోతున్న రోజులివి. మళ్ళీ హైదరాబాదు లౌకిక వాదులకు దక్కేనా అన్న మీమాంసకు గూడా దారితీసిన దాఖలాలు కనపడ్డ రోజులివి! అప్పుడు ఆశ్చర్యకరంగా ఒక అద్భుత సంఘటనను డ్యూటీ లో ఉన్న పోలీసు అధికారిగా నేను చూశాను. మళ్ళీ తెర మీదకు వచ్చిన లౌకిక వాదం, అసహనం చర్చల పరంపర చూసిన తర్వాత, ఆ సంఘటనే పదే పదే దాదాపు 25 ఏళ్ళ తర్వాత నా మస్తిష్కంలో మళ్ళీ మళ్ళీ మెదులుతున్నది.
ఆ రోజుల్లో రాజకీయ వల్లో, మరో కారణాల వల్లో అకస్మాత్తుగా మతపరమైన ఉద్రేక పరిస్థితులు హైదరాబాద్ నగరాన్ని అతలాకుతలం చేశాయి. పాత నగరంలో అలాంటి పరిస్థితులు ఏర్పడటం, సంఘటనలు జరగటం, ప్రభుత్వానికీ పోలీసులకూ కొత్తేమీ కాదు కానీ, ఏ మాత్రం అలాంటి అనుభవాలను అంతకు మునుపు ఎదుర్కొని ఉండని హిమాయత్ నగర్, చిక్కడపల్లి, నారాయణ గూడా లాంటి ప్రాంతాల్లో పథకం ప్రకారం మతకల్లోలాలు, హింస చెలరేగటం, నగర వాసులను విభ్రాంతికి గురి చేశాయి.
- రావులపాటి సీతారాంరావు