అనుకోకుండా కాశీ వెళ్ళాల్సి వచ్చింది మొదట్లో కాశీని చూడగానే పవిత్ర భావం కానీ ఆధ్యాత్మిక దృక్పథం కానీ కలగలేదు. వారం రోజుల పాటు అక్కడ వుండటంతో కాశీ అసలు స్వరూపం మాకు అవగతమయింది. అతి పురాతనమైన ఆ ప్రదేశానికున్న విలువ క్రమేపీ ఆ కొన్నాళ్ళల్లోనే తెలిసొచ్చింది. పుట్టుక గిట్టుక ప్రతి ప్రాణికీ సహజమే! కానీ కాశీకి మరణాన్ని అభిలషిస్తూ వచ్చేవారిని చూస్తుంటే చావు పుట్టుకల స్వరూప స్వభావాలను శోధించే శాస్త్రజ్ఞుల్లా కనపడ్డారు. సృష్టి రహస్యాలను ఛేదించటానికి, నిప్పూ, నీళ్ళను ఆలంబనగా చేసుకున్నారా అనిపించింది. శివుడి ఆజ్ఞలేనిదే చీమైనా కుట్టదన్న సామెతకు తోడు శివుడి ఆజ్ఞలేనిదే చావు కూడా కష్టమే అన్న భావన కూడా మదిలో తొణికిసలాడింది!
అన్నపూర్ణ ఆలయంలో కూర్చున్నప్పుడు కాశీని ఆలంబనగా చేసుకొని ఎందుకు ఒక రచన చేయగూడదన్న ఆలోచన వచ్చింది. వారణాసికి సంబంధించి పుస్తకాలు ఎవైనా దొరికితే బాగు అని అనుకుంటున్న తరుణంలో ఆలయంలో ఆయన తెలుగు వారే కావటం, యు. ఆర్. కె. మూర్తిగారు గా పరిచయం అవటం హైద్రాబాదు సెక్రటేరియట్ లో ఉద్యోగ విరమణ తర్వాత వారు శ్రీమతితో కల్సి కాశీలోని కాపురం వుండటం లాంటి వివరాలన్నీ తెలిసిన తర్వాత ఎన్నాళ్ళ నుంచో పదిలంగా ఆయన తన దగ్గరున్న బెనారస్ - సిటీ ఆఫ్ లైట్ అనే ఇంగ్లీషు పుస్తకాన్ని శుభాకాంక్షలతో 15-11-09 నాడు ఆ దేవాలయంలోనే నాకు యివ్వటం జరిగింది.
- రావులపాటి సీతారాంరావు