నేల విడిచి సాము చెయ్యకుండా ఆలోచనల్ని ఆకాశమంత ఎత్తుకి తీసుకువెళ్ళడానికి ఓ సీనియర్ ఐ పి ఎస్ అధికారి చేసిన ప్రయత్నం ఫలవంతమైతే ఆ ఫలం 'రావులపాటి సీతారాంరావు కథలు'. ఈ సంపుటిలో కొన్ని కథలు అసాధారణం. కొన్ని తరుచుగా గుర్తొచ్చి వెంటాడేవి. చక్కని భావనలకి తక్కువ మాటల్లో కథారూపం. అన్నీ మనచుట్టూ జరిగే కథలు, మనకు తెలిసిన వాళ్ళ కథలు, మనని మనకు పరిచయం చేసే పరిశీలనాత్మక కథలు. పాత్రచిత్రాన్నో, చాతుర్యమో, హాస్యమో, విషాదమో, అవగాహనో, సందేశమో, ప్రత్యేకమైన ప్రయోజనాత్మక కథలు చదివితే 'ఇలా మనమూ వ్రాయగలం' అనిపించేంత సరళమైన కలంపడితే (నానృహి:కురుతే కావ్యమ్) అనిపింపజేసే కథన ప్రతిభనింపుకున్న కథలు. ఈ సంపుటి తెలుగు సాహితికి చక్కని అలంకారం.
- వసుంధర
నేల విడిచి సాము చెయ్యకుండా ఆలోచనల్ని ఆకాశమంత ఎత్తుకి తీసుకువెళ్ళడానికి ఓ సీనియర్ ఐ పి ఎస్ అధికారి చేసిన ప్రయత్నం ఫలవంతమైతే ఆ ఫలం 'రావులపాటి సీతారాంరావు కథలు'. ఈ సంపుటిలో కొన్ని కథలు అసాధారణం. కొన్ని తరుచుగా గుర్తొచ్చి వెంటాడేవి. చక్కని భావనలకి తక్కువ మాటల్లో కథారూపం. అన్నీ మనచుట్టూ జరిగే కథలు, మనకు తెలిసిన వాళ్ళ కథలు, మనని మనకు పరిచయం చేసే పరిశీలనాత్మక కథలు. పాత్రచిత్రాన్నో, చాతుర్యమో, హాస్యమో, విషాదమో, అవగాహనో, సందేశమో, ప్రత్యేకమైన ప్రయోజనాత్మక కథలు చదివితే 'ఇలా మనమూ వ్రాయగలం' అనిపించేంత సరళమైన కలంపడితే (నానృహి:కురుతే కావ్యమ్) అనిపింపజేసే కథన ప్రతిభనింపుకున్న కథలు. ఈ సంపుటి తెలుగు సాహితికి చక్కని అలంకారం. - వసుంధర© 2017,www.logili.com All Rights Reserved.