"బ్రాహ్మణవాదం మూలాలు; ప్రత్యామ్నయ సంస్కృతి నిర్మాణం" పద్మారావుగారి రచనలలో అతి ముఖ్యమైనది. 450 పేజీలున్న ఈ రచన రెండు డజన్ల అంశాలను స్పృశించింది. బ్రాహ్మణవాదం, బ్రాహ్మణత్వం పై చాలా మంది విదేశీయులు, భారతీయులు పరిశోధనాత్మక రచనలు చేశారు. అయితే అందులో చాలా మంది ఆయా వర్గాలకు చెందిన వారిగా, ఆ 'తత్వం' లో గల లోటు పాట్లను ఎత్తి చూపిన అంతర్గత వ్యక్తులుగా ఆ రచనలు సాగాయి. విదేశీయుల రచనలలో నాకు చాలా వరకు నచ్చని అంశం ఏమిటంటే,కులం పట్ల వారికి సరైన అవగాహన లేదు. పైగా వారి రచనలలో ముఖ్యంగా వారికి ఉపయోగపడిన పరిశోధనకు కావలసిన సోర్స్ బ్రాహ్మణ కులానికి లేక ఆ కులం పట్ల భక్తి భావన కలిగిన వారు అనువాదం చేశారో లేక తమ అనుభవాలను మేళవించి చెప్పటంతో, ఆ రచనలకు మనం పెద్దగా విలువనివ్వక్కర్లేదు. ఇందులో పద్మారావు గారు అన్నీ నిజాలే చెప్పారు, అభిప్రాయాలే లేవు అని నేను అనను. ఇది ఆయన సామాజిక శాస్త్ర పరిశోధనలో చేసిన మొదటి ప్రయత్నం.
- కత్తి పద్మారావు
"బ్రాహ్మణవాదం మూలాలు; ప్రత్యామ్నయ సంస్కృతి నిర్మాణం" పద్మారావుగారి రచనలలో అతి ముఖ్యమైనది. 450 పేజీలున్న ఈ రచన రెండు డజన్ల అంశాలను స్పృశించింది. బ్రాహ్మణవాదం, బ్రాహ్మణత్వం పై చాలా మంది విదేశీయులు, భారతీయులు పరిశోధనాత్మక రచనలు చేశారు. అయితే అందులో చాలా మంది ఆయా వర్గాలకు చెందిన వారిగా, ఆ 'తత్వం' లో గల లోటు పాట్లను ఎత్తి చూపిన అంతర్గత వ్యక్తులుగా ఆ రచనలు సాగాయి. విదేశీయుల రచనలలో నాకు చాలా వరకు నచ్చని అంశం ఏమిటంటే,కులం పట్ల వారికి సరైన అవగాహన లేదు. పైగా వారి రచనలలో ముఖ్యంగా వారికి ఉపయోగపడిన పరిశోధనకు కావలసిన సోర్స్ బ్రాహ్మణ కులానికి లేక ఆ కులం పట్ల భక్తి భావన కలిగిన వారు అనువాదం చేశారో లేక తమ అనుభవాలను మేళవించి చెప్పటంతో, ఆ రచనలకు మనం పెద్దగా విలువనివ్వక్కర్లేదు. ఇందులో పద్మారావు గారు అన్నీ నిజాలే చెప్పారు, అభిప్రాయాలే లేవు అని నేను అనను. ఇది ఆయన సామాజిక శాస్త్ర పరిశోధనలో చేసిన మొదటి ప్రయత్నం. - కత్తి పద్మారావు© 2017,www.logili.com All Rights Reserved.