ఈనాడు తెలంగాణ ప్రజలు దశాబ్దాలుగా కన్న కల సాకారమైంది. నూతనంగా ఆవిర్భవించిన తెలంగాణా అన్ని రంగాలలో కొత్త చైతన్యంతో ఆత్మావిశ్వాసంతో - దీక్షా దక్షలతో ముందుకు వెళ్ళడం వెనుక పలువురి కృషీ - త్యాగం దాగి ఉంది. గత చరిత్రనూ, వనరులనూ - వలసలనూ, నాటి స్థితిగతులనూ జనజీవిత సరళులనూ - అణచివేతలనూ, ఆందోళలనూ అంచనా వేసుకోనిదే ముందుకు సరైన దిశలో సాగలేం. అందుకు ఇలాంటి నాటి గ్రంథాల ఆవశ్యకత ఎంతైనా ఉంది.
వీటిని పునరుద్దించి అందుబాటులోనికి తీసుకురానిది నాటి మేధావులు చరిత్రాకారులు పడిన శ్రమ నేటి తరానికి అర్థం కాదు. ఎంతటి వ్యతిరేక పరిస్థితుల మధ్యనయినా బలమయిన రాజకీయ వ్యవస్థను సైతం ఎదిరించి తమ జీవితాలను పణంగా పెట్టి సాధించిన పరిశోధన; వెలుగులోకి పలు అంశాలను తెస్తూ - తెలుగుజాతి స్ఫూర్తిమంతానికి వారు ఎంత దోహదం చేశారో అవగాహన చేసుకోలేం. నిజమైన గతం తెలియంది భవిష్యత్ రూపకల్పన అర్థవంతం కాదు. అభివృద్ధి లక్ష్యాల అంచనాను సరిగా నిర్దారించుకోలేం. ఆ పునాదుల బలం మీదనే భవిష్యత్ సౌధం నిర్మితం అవుతుంది.
అందుకు ఆదిరాజు వీరభద్రరావు గారి 'మన తెలంగాణము' గ్రంథం ఉపయోగపడుతుంది. ఇది గతంలో - వట్టికోట ఆళ్వారుస్వామి గారి దేశోద్ధారక గ్రంథమాల 1956 లో తొలిసారి ప్రచురించింది. వట్టికోట - తెలంగాణ ఆవిర్భావానికి నాడు పడ్డ తపన, సాగించిన ప్రచారం దీనివల్ల కొంత తెలుస్తుంది.
- ఏటుకూరి ప్రసాద్
ఈనాడు తెలంగాణ ప్రజలు దశాబ్దాలుగా కన్న కల సాకారమైంది. నూతనంగా ఆవిర్భవించిన తెలంగాణా అన్ని రంగాలలో కొత్త చైతన్యంతో ఆత్మావిశ్వాసంతో - దీక్షా దక్షలతో ముందుకు వెళ్ళడం వెనుక పలువురి కృషీ - త్యాగం దాగి ఉంది. గత చరిత్రనూ, వనరులనూ - వలసలనూ, నాటి స్థితిగతులనూ జనజీవిత సరళులనూ - అణచివేతలనూ, ఆందోళలనూ అంచనా వేసుకోనిదే ముందుకు సరైన దిశలో సాగలేం. అందుకు ఇలాంటి నాటి గ్రంథాల ఆవశ్యకత ఎంతైనా ఉంది. వీటిని పునరుద్దించి అందుబాటులోనికి తీసుకురానిది నాటి మేధావులు చరిత్రాకారులు పడిన శ్రమ నేటి తరానికి అర్థం కాదు. ఎంతటి వ్యతిరేక పరిస్థితుల మధ్యనయినా బలమయిన రాజకీయ వ్యవస్థను సైతం ఎదిరించి తమ జీవితాలను పణంగా పెట్టి సాధించిన పరిశోధన; వెలుగులోకి పలు అంశాలను తెస్తూ - తెలుగుజాతి స్ఫూర్తిమంతానికి వారు ఎంత దోహదం చేశారో అవగాహన చేసుకోలేం. నిజమైన గతం తెలియంది భవిష్యత్ రూపకల్పన అర్థవంతం కాదు. అభివృద్ధి లక్ష్యాల అంచనాను సరిగా నిర్దారించుకోలేం. ఆ పునాదుల బలం మీదనే భవిష్యత్ సౌధం నిర్మితం అవుతుంది. అందుకు ఆదిరాజు వీరభద్రరావు గారి 'మన తెలంగాణము' గ్రంథం ఉపయోగపడుతుంది. ఇది గతంలో - వట్టికోట ఆళ్వారుస్వామి గారి దేశోద్ధారక గ్రంథమాల 1956 లో తొలిసారి ప్రచురించింది. వట్టికోట - తెలంగాణ ఆవిర్భావానికి నాడు పడ్డ తపన, సాగించిన ప్రచారం దీనివల్ల కొంత తెలుస్తుంది. - ఏటుకూరి ప్రసాద్© 2017,www.logili.com All Rights Reserved.