ఈ "పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్థ - మార్క్సిస్టు అవగాహన " పుస్తకం చూసేందుకు చిన్నగానే ఉంటుంది కానీ లోపలి విషయం మాత్రం అపారం. అర్థశాస్త్రం అంటేనే సంక్లిష్టమైనది. అందులోనూ పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్థ పైకి ఒక విధంగా కనిపిస్తే, దాని అసలు స్వభావం మరో విధంగా ఉంటుంది. అయినా అలాంటి సబ్జెక్టును సంక్షిప్తంగా, సాధ్యమైనంత సరళంగా అందించారు బివి రాఘవులు. కొన్ని వందల పేజీల్లో వివరించబడిన అంశాలను ఈ చిన్న పుస్తకంలో పొందుపరిచారు. అందుచేతనే ఇది సంక్షిప్త, సమగ్ర పెట్టుబడిదారీ రాజకీయ అర్థశాస్త్రం. ఇలాంటి విశిష్ట రచన ప్రతి రాజకీయ అర్థశాస్త్ర విద్యార్థికి అత్యవసరమైనది. మరింత లోతైన అధ్యయనాన్ని ఇది ప్రోత్సహిస్తుంది, దారి చూపుతుంది. అధ్యయన తరగతులకు ఇది తప్పనిసరి పుస్తకం.