కూచుంటే ఒక కథ. లేస్తే మరోకథ. ఇట్లా నాలుగు వందల పాతిక సంవత్సరాల పురాతన హైదరాబాద్ నగరం కథలకు పుట్టినిల్లు. కథలకు కార్ఖానా. ఇక్కడ ప్రతి బస్తి బస్తీకీ, గల్లి గల్లీకి, ప్రతి మంజిల్ కు, ప్రతి మహల్ కు, ప్రతి హవేలీకి, ప్రతి దేవుడికీ, ప్రతి బాడాకు, ప్రతి వాడకు ఒక కమ్మని కథనో లేక కన్నీటి కథ వెనుక ఒక వెతనో ఉంటుంది. ఒకోసారి కథ వెనక కథ కూడా ఉంటుంది. ఈ కథలు ఒక కంట మనల్ని నవ్వించి మరో కంట కన్నీరు పెట్టిస్తాయి. ఈ కథలలోకి తొంగి చూస్తే మనకు నాలుగు వందల సంవత్సరాల నగర చరిత్రేగాక ప్రజల జనజీవన జగన్నాటకం కూడా కనబడుతుంది.
మతకల్లోలాలతో, మారణహోమాలతో పాతనగరం ప్రజల అభివృద్ధి నిర్లక్ష్యానికి గురి అయ్యింది. అంతేగాక అసాంఘిక శక్తులకు, గుండాలకు, రౌడీలకు పాత నగరం ఒక అడ్డా అని చరిత్ర చెక్కిలి మీద లేని మసిపూసి బద్నాం చేశారు. ఆ అపప్రధను తొలగించి మన హైద్రాబాద్ గత వైభోవోజ్వల చరిత్ర పునరావిష్కరణకే ఈ "షహర్ నామా" కథలు.
కూచుంటే ఒక కథ. లేస్తే మరోకథ. ఇట్లా నాలుగు వందల పాతిక సంవత్సరాల పురాతన హైదరాబాద్ నగరం కథలకు పుట్టినిల్లు. కథలకు కార్ఖానా. ఇక్కడ ప్రతి బస్తి బస్తీకీ, గల్లి గల్లీకి, ప్రతి మంజిల్ కు, ప్రతి మహల్ కు, ప్రతి హవేలీకి, ప్రతి దేవుడికీ, ప్రతి బాడాకు, ప్రతి వాడకు ఒక కమ్మని కథనో లేక కన్నీటి కథ వెనుక ఒక వెతనో ఉంటుంది. ఒకోసారి కథ వెనక కథ కూడా ఉంటుంది. ఈ కథలు ఒక కంట మనల్ని నవ్వించి మరో కంట కన్నీరు పెట్టిస్తాయి. ఈ కథలలోకి తొంగి చూస్తే మనకు నాలుగు వందల సంవత్సరాల నగర చరిత్రేగాక ప్రజల జనజీవన జగన్నాటకం కూడా కనబడుతుంది. మతకల్లోలాలతో, మారణహోమాలతో పాతనగరం ప్రజల అభివృద్ధి నిర్లక్ష్యానికి గురి అయ్యింది. అంతేగాక అసాంఘిక శక్తులకు, గుండాలకు, రౌడీలకు పాత నగరం ఒక అడ్డా అని చరిత్ర చెక్కిలి మీద లేని మసిపూసి బద్నాం చేశారు. ఆ అపప్రధను తొలగించి మన హైద్రాబాద్ గత వైభోవోజ్వల చరిత్ర పునరావిష్కరణకే ఈ "షహర్ నామా" కథలు.© 2017,www.logili.com All Rights Reserved.