ఈ పుస్తకంలో సాధ్యమైనన్ని పి సుశీల పాడిన మంచి పాటలను పొందుపరిచారు. కేవలం సాహిత్యం మాత్రమే కాదు, పాట గురించిన విశ్లేషణ, పాట వెనుక సంగీతదర్శకుల, సాహిత్యస్రష్టల తపన, కొన్ని సందర్భాల్లో దర్శకులు పాటను చిత్రీకరించిన తీరు, గాయనీగాయకుల అంకితభావం, నిర్మాణసంస్థల వివరాలు, కొన్ని అద్భుతమైన ఛాయాచిత్రాలు వీటన్నిటి సమాహారం 'పాడనా తెనుగుపాట'. పాటకై ప్రాణం పెట్టే రవిచంద్రన్ లాంటి వారే ఈ సంకలనం చేయగలరు. వీరి కృషి తరతరాలకూ ఉపయోగపడుతుంది. పాటకు వీరు చేసిన విశ్లేషణ చదివాక, మళ్ళీ ఆ దృష్టితో పాటను చూడాలి, వినాలి అన్న పిపాసను కలిగించి ధన్యులయ్యారు కంపల్లె రవిచంద్రన్.
ఈ పుస్తకంలో సాధ్యమైనన్ని పి సుశీల పాడిన మంచి పాటలను పొందుపరిచారు. కేవలం సాహిత్యం మాత్రమే కాదు, పాట గురించిన విశ్లేషణ, పాట వెనుక సంగీతదర్శకుల, సాహిత్యస్రష్టల తపన, కొన్ని సందర్భాల్లో దర్శకులు పాటను చిత్రీకరించిన తీరు, గాయనీగాయకుల అంకితభావం, నిర్మాణసంస్థల వివరాలు, కొన్ని అద్భుతమైన ఛాయాచిత్రాలు వీటన్నిటి సమాహారం 'పాడనా తెనుగుపాట'. పాటకై ప్రాణం పెట్టే రవిచంద్రన్ లాంటి వారే ఈ సంకలనం చేయగలరు. వీరి కృషి తరతరాలకూ ఉపయోగపడుతుంది. పాటకు వీరు చేసిన విశ్లేషణ చదివాక, మళ్ళీ ఆ దృష్టితో పాటను చూడాలి, వినాలి అన్న పిపాసను కలిగించి ధన్యులయ్యారు కంపల్లె రవిచంద్రన్.© 2017,www.logili.com All Rights Reserved.